Anchor Udaya Bhanu: బెంజ్ కారు కొన్న సీనియర్ యాంకర్…

| Edited By: Pardhasaradhi Peri

Feb 17, 2020 | 3:39 PM

Anchor Udaya Bhanu: యాంకర్ ఉదయభాను..ఇప్పుడంటే ఈ భామ హడావిడి తగ్గిపోయింది కానీ.. ఒకప్పుడు స్మాల్ స్క్రీన్‌పై లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చాటింది. ‘డాన్స్ బేబీ డాన్స్’,  ‘సాహసం చేయరా డింభకా’, ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘పిల్లలు పిడుగులు’ వంటి ఎన్నో ప్రొగ్రామ్స్‌కు వ్యాఖ్యాతగా పనిచేసింది. ఓ వైపు బుల్లితెరపై షో చేస్తూ..అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరుస్తూ అదరగొట్టింది. మంచి ఫామ్‌లో ఉన్న 2004లోనే విజయ్ కుమార్‌ను వివాహాం చేసుకున్న ఉదయభాను.. ఆ తర్వాత […]

Anchor Udaya Bhanu: బెంజ్ కారు కొన్న సీనియర్ యాంకర్...
Follow us on

Anchor Udaya Bhanu: యాంకర్ ఉదయభాను..ఇప్పుడంటే ఈ భామ హడావిడి తగ్గిపోయింది కానీ.. ఒకప్పుడు స్మాల్ స్క్రీన్‌పై లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చాటింది. ‘డాన్స్ బేబీ డాన్స్’,  ‘సాహసం చేయరా డింభకా’, ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘పిల్లలు పిడుగులు’ వంటి ఎన్నో ప్రొగ్రామ్స్‌కు వ్యాఖ్యాతగా పనిచేసింది. ఓ వైపు బుల్లితెరపై షో చేస్తూ..అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరుస్తూ అదరగొట్టింది. మంచి ఫామ్‌లో ఉన్న 2004లోనే విజయ్ కుమార్‌ను వివాహాం చేసుకున్న ఉదయభాను.. ఆ తర్వాత కూడా బుల్లితెరపై అలరించారు. కొన్నాళ్లకు క్రమక్రమంగా ఈ స్టార్ యాంకర్ వైభవం తగ్గుతూ వచ్చింది. 2016 ఆగష్టులో ఇద్దరు కవల పిల్లలకు ఆమె జన్మనిచ్చారు. ఆ తర్వాత నుంచి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైపోయారు ఉదయభాను.

పిల్లలు కొంచెం పెద్దవాళ్లు అవ్వడంతో మరోసారి ఆమె బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు.  ‘కళ్యాణ లక్ష్మి’ అనే మహిళా కార్యక్రమానికి యాంకర్‌గా, ‘జూలకటక’ అనే కామెడీ షోకు జడ్జిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ‘గ్యాంగ్ లీడర్’ అనే కామెడీ ప్రొగ్రామ్ యాంకర్‌గా కొనసాగుతున్నారు. అప్పుడప్పుడు ఈవెంట్స్‌లో సైతం కనిపిస్తున్నారు. కాగా ఇటీవలే ఓ కాస్ట్‌లీ బెంజ్ కారును కొనుగోలు చేశారు ఈ యాంకర్. కారును షోరూమ్‌ వాళ్లు డెలివరీ ఇస్తోన్న సమయంలో తీసిన ఫొటో తాజాగా బయటికి వచ్చింది. అయితే ఒకప్పుడు కేవలం అగ్రతారలు మాత్రమే ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల యాంకర్స్, సింగర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం అదిరిపోయే కార్లు, బంగ్లాలు కొనేస్తున్నారు. ఇండస్ట్రీ మాంచి రైజ్‌లో ఉంది అనడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్‌ ఉదాహారణగా నిలుస్తాయి.

ఇది కూడా చదవండి : హీరో శ్రీకాంత్ ఇంట విషాదం..