Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..

తెలుగు ప్రజలకు యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) సుపరిచితమే.. బుల్లితెరపై టాప్ యాంకర్‏గా సుమ కనకాల ఫేమస్.. టీవీల్లో.

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..
Suma

Updated on: May 05, 2022 | 8:01 PM

తెలుగు ప్రజలకు యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) సుపరిచితమే.. బుల్లితెరపై టాప్ యాంకర్‏గా సుమ కనకాల ఫేమస్.. టీవీల్లో.. ఈవెంట్స్‏లో తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సుమకు సాటిలేరు. మొదట్లో సినిమాలు. సీరియల్స్ చేసిన సుమ.. ఆ తర్వాత పూర్తిగా యాంకరింగ్‏కు పరిమితమైపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత సుమ కనకాల వెండితెరపై సందడి చేయబోతుంది. జయమ్మ పంచాయతీ సినిమా సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీ రేపు (మే 6న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్‏లో పాల్గొంటూ పలు ఇంటర్వ్యూలలో పాల్గోంటుంది. ఇటీవల ప్రముఖ కమెడియన్ ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగా షోలో పాల్గోన్న సుమ.. తన కుటుంబవిషయాలు.. సినిమాల గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే.. రాజీవ్ కనకాల.. సుమ విడాకులు తీసుకున్నారంటూ వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సుమ కనకాల.

సంవత్సరం క్రితం సుమ.. రాజీవ్ కనకాల విడిపోయారని.. వేరు వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి.. ఆ పంచాయతీ ఈ సినిమాలో ఉంటుందా అని ఆలీ అడగ్గా.. సుమ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.. పెళ్లి అనేది ఓ పంచాయతీ అని.. తామిద్దరికీ పంచాయతీ మొదలై 23 ఏళ్లు అయ్యిందని.. ఇన్నెళ్లలో చాలా గొడవలు అయ్యాయి.. భార్యభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం.. రోజులో కనీసం 2, 3 సార్లు గొడవపడతాం. అన్నీ సహజం.. కానీ మేము విడాకులు తీసుకున్నామని వెబ్ సైట్స్ వాళ్లు రాశారు..అలాంటిది ఏమి లేదు. మేము కలిసే ఉన్నాం. ఆనందంగా ఉన్నాం.. అలాంటి వార్తలు చూసి బాధపడ్డాను.. కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయం గురించి ఇక్కడే మాట్లాడుతున్నాను.. భార్యభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులభం కానీ..తల్లిదండ్రులుగా చాలా కష్టం. పిల్లలు ఒక బాధ్యత.. ఇప్పటివరకు మాకు విడాకుల ఆలోచన రాలేదు.. ఇకపై కూడా రాదు అంటూ చెప్పుకొచ్చింది సుమ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Viral Photo: చిలిపి కళ్ల బుజ్జాయి.. లేత బుగ్గల పాపాయి.. ఈ చిన్నారి ఇప్పుడు అందాల సోయగం.. ఎవరో గుర్తుపట్టారా ?..

KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..

Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..