మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడికి వచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. అలాగే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోందీ ఈ ముద్దుగుమ్మ .

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ
Anchor Rashmi

Updated on: Mar 03, 2026 | 5:05 PM

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఒక పేరు మాత్రం పెను సంచలనం సృష్టిస్తోంది. అదే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేరు. ఇటీవలి దాడుల్లో ఖమేనీ మృతి చెందడంతో యుద్ధం మరింత తారాస్థాయికి చేరుకుంది. ఖమేనీ మృతిపై ఇండియాలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కొందరు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన పై యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. దాంతో పలువురు నెటిజన్స్ ఆమె పై ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు. రష్మికూడా తగ్గేదే లే అన్నట్టు ఘాటుగా స్పందించింది.

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

కొన్ని నెలల క్రితం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఒక్కరు కూడా బయటకు రాలేదు, ఇప్పుడు అక్కడెక్కడో ఒక వ్యక్తికి ఎదో అయ్యిందని.. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తారా.? మీకు ఇరాన్ మీద అంతగా ప్రేమ ఉంటే.. మోదీ గారికి నాదొక విన్నపం.. రోడ్ల పై నిరసన చేస్తున్న వీరందరిని ఇరాన్ పంపించేయండి. అక్కడికి వెళ్లి ఆ దేశం తరఫున యుద్ధం చేస్తారు అంటూ సోషల్ మీడియాలో రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. దీని పై స్పందిస్తూ ఓ నెటిజన్ ముందు నువ్వు నువ్వు పెళ్లి చేసుకుని, సుఖంగా ఉండటం మంచిది. ఒంటరిగా ఉండటం వల్లే నీకు ఇలా ఇతర మతాల మీద ఇంత ద్వేషం పుడుతున్నట్టుంది అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

దీని పై కూడా రష్మీ గట్టిగానే రియాక్ట్ అయ్యింది.. తొమ్మిదేళ్లకే బాలికలకు పెళ్లిళ్లు చేసే దేశంలో నేను లేను. నేను పెళ్లి చేసుకోకుండా ఉండగలను, పిల్లలు లేకుండా కూడా ఉండగలను. అయినా సరే, నా దేశంలో నాకు ఒక గుర్తింపు, గౌరవం ఉంది. అవి చాలు నేను జీవించగలను అంటూ రష్మీ రాసుకొచ్చింది,. దీని పై కూడా ఆ నెటిజన్ విమర్శలు చేశాడు. దాంతో రష్మీ మరింత సీరియస్ అయ్యింది. “మన దేశంలో జనాభా బెంచ్‌మార్క్‌ను దాటుతున్న తీరు చూస్తే, మీరు ప్రజలకు రక్షణ (కండోమ్‌లు) ఉపయోగించమని లేదా మొత్తం క్రికెట్ టీమ్ అంత మంది పిల్లల్ని కనడం లాంటివి చేయకుండా ఆపరేషన్ చేయించుకోవాలని ప్రచారం చేయండి. ? మిగిలిన మేము సజావుగా పని చేస్తాము. మేము మా పన్నులు చెల్లిస్తాము, నా జీవితంలో నాకు తోడు ఉందా.? లేదా.? అనేది నాకు మాత్రమే తెలుసు అంటూ రాసుకొచ్చింది రష్మీ ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us