ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. పలు టీవీషోలతో చాలా ఫెమస్ అయ్యింది రష్మీ. ఇక టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ నటించింది రష్మీ. ఇక ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. ఈ అమ్మడు అందంతో అభినయం తో బుల్లితెర పైనే కాదు వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక తనదైన మాటలతో యాంకరింగ్ తో కట్టిపడేసే రష్మీ .. కాంట్రవర్సీ కి ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటూ వస్తుంది. తన పై వచ్చే ట్రోల్స్ గురించి కూడా రష్మీ పట్టించుకున్న సందర్భాలు కూడా తక్కువే.. తాజాగా రష్మీ ఇంట విషాదం చోటు చేసుకుంది.
రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా కన్నుమూశారు. రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, మాపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని, మాకు భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు మాతో ఎప్పుడూ ఉంటాయని ఓం శాంతి అంటూ రష్మి గౌతమ్ పోస్ట్ పెట్టింది.
ఈ విధంగా రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవడంతో రష్మీ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఆమెకు దైర్యం చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రష్మీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది రష్మీ.