Anasuya Bharadwaj: వారిని క్షమించమని కోరిన అనసూయ.. కానీ ఆ విషయానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుందట..

|

Jul 20, 2022 | 8:37 AM

ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దర్జా. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ మూవీలో సునీల్ కీలకపాత్రలో

Anasuya Bharadwaj: వారిని క్షమించమని కోరిన అనసూయ.. కానీ ఆ విషయానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుందట..
Anasuya
Follow us on

యాంకర్ అనసూయ (Anasuya)..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర ఆడియన్స్‏కు ఆమె సుపరిచితం. రియాల్టీ షోలకు యాంకర్‏కు వ్యవహరిస్తూ ప్రజలను అలరించింది. ఇక ఓవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా మెరిసింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో మెప్పించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఇటీవలే పాన్ ఇండియా చిత్రం పుష్పలోనూ దాక్షాయణి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దర్జా. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ మూవీలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. దర్జా సినిమా ప్రమోషన్లలో భాగం కాలేకపోయినందుకు చిత్రయూనిట్ తనను క్షమించాలని..అలాగే తమ సినిమాకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్లకు థాంక్స్ అని తెలిపింది.

అనసూయ మాట్లాడుతూ.. ‘‘దర్జా మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. అల్లు అరవింద్‌గారు, వెంకటేష్‌గారు, సురేష్‌బాబుగారు, రాఘవేంద్రరావుగారు, నవీన్ ఎర్నేనిగారు, బుచ్చిమాయ్య.. వీరంతా ‘దర్జా’ టీమ్‌కు ఎంతో సపోర్ట్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ భాగం కాలేదు. అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నేను పార్ట్ కావడానికి కారణం ఇద్దరు. ఒకరు ప్రభుగారు, మరొకరు షకీల్‌గారు. దర్శకుడు మాక్.. ఎప్పుడూ కంగారుగా ఉండేవారు. ఇప్పుడు కాస్త వైట్ డ్రస్సులో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కనకం పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి. జోక్స్ పార్ట్ పక్కన పెడితే.. ఇది అద్భుతమైన సినిమా. థియేటర్లకి వచ్చి ఈ సినిమాని చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో వస్తుంది కదా.. అని వెయిట్ చేయకండి. థియేటర్‌లో జూలై 22న వస్తున్న ఈ సినిమా చూడండి. థ్యాంక్యూ ఆల్’’ అని అన్నారు.