అందాల యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తుంది అనసూయ(Anasuya Bharadwaj). అందం చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనసూయ. తనదైన మాటకారీ తనంతో బుల్లితెరపై చక్రం తిప్పుతూనే అటు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది అనసూయ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్త క్యారెక్టర్ తో అదరగొట్టిన అనసూయ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షాయణి గా నెగిటివ్ రోల్ లో నటించి అలరించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్నా విషయం తెలిసిందే.. నిత్యం తన ఫోటోస్ తో వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది అనసూయ. తన పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు స్ట్రాంగ్ గా రీప్లే ఇస్తూ ఉంటుంది ఈ వయ్యారి.
తాజాగా ఓ వీడియో షేర్ చేసింది అనసూయ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియను షేక్ చేస్తుంది. మరోసారి తన అందం తో కుర్రాళ్లను కట్టిపడేసింది అనసూయ. ఈ వీడియోలో సముద్రం ఒడ్డున అలలతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అందమైన మ్యూజిక్ కు స్లోమోషన్ యాడ్ చేసి వీడియోను షేర్ చేసింది అనసూయ. అందాలు ఆరబోస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందమైన వీడియో పై మీరూ ఓ లుక్కెయండి.