చాలా మంది హీరోయిన్స్ అందంగా కనిపించడం కోసం.. ఏవేవో చేస్తూ ఉంటారు. గ్లామర్ కాపాడుకోవడం కోసం ఎన్నో రకరాల క్రీమ్స్, సోప్స్, సీరమ్స్ లాంటివి వాడుతూ ఉంటారు. మరికొంతమంది అందం కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. సర్జరీలు కూడా చేయించుకుంటుంటారు. కానీ చాలా డిఫరెంట్. అందం కోసం ఏడుస్తుందట ఈ అమ్మడు. అంతే కాదు తాను ఏడిస్తేనే ఎక్కువ అందంగా ఉంటాను అంటుంది. అది విని అందరూ షాక్ అవుతున్నారు. కొంతమంది ఏడిస్తే బాగుంటారు. కానీ ఈ అమ్మడు అందం కోసం ఏడుస్తా అని అంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందంలోనూ నటనలోనూ ఈ చిన్నది. పాన్ ఇండియా సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది ఒకే క్క సినిమా కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. కానీ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అదే సమయంలో ఈ అమ్మడు తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఆ తర్వాత అనన్య టాలీవుడ్ లో తిరిగి సినిమా చేయలేదు. బాలీవుడ్ పైనే ఈ అమ్మడు ఎక్కువ ద్రుష్టి పెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన గ్లామర్ సీక్రెట్ బయట పెట్టింది. తన అందానికి కారణం ఏడుపు అని చెప్పింది ఈ భామ. తాజాగా అనన్య మాట్లాడుతూ.. తనకు ఏడుపు అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కన్నీళ్లతో నిండిన కళ్ళు తనకు నేచురల్ అందాన్ని, తన ముఖంలో మెరుపుని ఇస్తాయి అని చెప్పుకొచ్చింది. మాములుగా కంటే ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉంటాను. చాలాసార్లు ఏడుస్తూ అద్దంలో చూసుకున్నాను. నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేను. నాకు ఆటోమేటిగ్గా కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లు నా అందాన్ని మరింత పెంచుతాయి. అప్పుడప్పుడు నా సోషల్ మీడియాలో నేను ఏడ్చే ఫొటోలు కూడా పెడతాను అని చెప్పుకొచ్చింది అనన్య పాండే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.