Ananya Nagalla: ఇకపై అలాంటి రోల్స్ చేస్తానంటూ కామెంట్స్.. ఓపెనైన అనన్య నాగళ్ళ..

|

Feb 29, 2024 | 1:35 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సబ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్యకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో  సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తంత్ర, పొట్టేలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో తంత్ర సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు.

Ananya Nagalla: ఇకపై అలాంటి రోల్స్  చేస్తానంటూ కామెంట్స్.. ఓపెనైన అనన్య నాగళ్ళ..
Ananya Nagalla
Follow us on

టాలీవుడ్ అందాల భామల్లో అనన్య నాగళ్ళ ఒకరు. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ తెలుగమ్మాయి. ప్రియా దర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సబ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్యకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో  సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తంత్ర, పొట్టేలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో తంత్ర సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో హీరోయిన్ అనన్య మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇప్పటివరకు ఈ చిన్నది గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా కనిపించలేదు. అయితే పొట్టేలు సినిమా ట్రైలర్ లో మాత్రం ఓ ముద్దు సీన్ లో కనిపించింది. అంతే కాదు ఈసినిమాలో గ్లామర్ గేట్లు ఎత్తేసి బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయిందని టాక్ వినిపిస్తుంది. తాజాగా దీని పై అనన్యకు ప్రశ్న ఎదురైంది. పొట్టేలు సినిమాలో మాదిరిగానే .. తంత్ర సినిమాలోనూ ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అన్న ప్రశ్నకు అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సినిమా కథకు అవసరమైతే బోల్డ్ సీన్స్ లో నటిస్తానని చెప్పకనే చెప్పింది ఈ చిన్నది. తంత్ర సినిమాలోనూ రొమాంటిక్ , బోల్డ్, హారర్ అన్ని ఉన్నాయని తెలిపింది అనన్య. అలాగే ప్రతి ఆరు నెలలకు మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తుంటాయి. నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో మంచి పాత్రలు వస్తేనే చేద్దాం అనుకున్నాను కానీ.. ఇవన్నీ నటనలో భగమే అని తెలుకున్నాను. అప్పటిలో పర్ఫామెన్స్‌ చేస్తే చాలు అనుకున్నా.. కానీ ఇవన్నీ పర్ఫామెన్స్‌ లో భాగమే అని తెలుసుకునేందుకు సమయం పట్టిందని తెలిపింది అనన్య. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను ఉడికిస్తున్నాయి. మతిపోయే ఫోజులను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అనన్య.

అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.