AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. బుజ్జి గురించి ఏమన్నారంటే..

డిఫరెంట్ లుక్‏లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జి కారుకు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఇంకెన్ని విభిన్న వాహనాలు ఉంటాయి ?.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో నెట్టింట వైరలవుతుంది. బుజ్జి కారు స్పెషాలిటీస్ పరిచయం చేస్తూ ఉన్న వీడియో ఆకట్టుకుంటుంది.

Anand Mahindra: డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. బుజ్జి గురించి ఏమన్నారంటే..
Anand Mahindra
Rajitha Chanti
|

Updated on: May 24, 2024 | 8:43 AM

Share

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కల్కి 2898 ఏడీ సినిమా గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఇటీవల భైరవ బుజ్జిని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల బుజ్జి కోసం భారీ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్లో అభిమానులకు పరిచయం చేసేందుకు బుజ్జిని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు ప్రభాస్. డిఫరెంట్ లుక్‏లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జి కారుకు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఇంకెన్ని విభిన్న వాహనాలు ఉంటాయి ?.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో నెట్టింట వైరలవుతుంది. బుజ్జి కారు స్పెషాలిటీస్ పరిచయం చేస్తూ ఉన్న వీడియో ఆకట్టుకుంటుంది.

తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో నాగ్ అశ్విన్ పెట్టి ట్వీట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ.. “నిజానికి సరదా సంగతులు ట్విట్టర్ లోనే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్.. అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్రయూనిట్ చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సహయపడుతుంది. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘సాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారు. ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇవ్వగా.. ‘కలలు కనడం మానొద్దు.. ‘ అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్టర్ ముచ్చట నెట్టింట వైరలవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..
సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..