Gam Gam Ganesha Twitter Review: గం గం గణేశా ట్విట్టర్ రివ్యూ.. బేబి తర్వాత ఆనంద్ మరో హిట్ అందుకున్నాడా..?

బేబి హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గం గం గణేశా. ఈ మూవీతో డైరెక్టర్ ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించగా.. జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు.

Gam Gam Ganesha Twitter Review: గం గం గణేశా ట్విట్టర్ రివ్యూ.. బేబి తర్వాత ఆనంద్ మరో హిట్ అందుకున్నాడా..?
Gam Gam Ganesha Twitter Rev

Updated on: May 31, 2024 | 7:36 AM

ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బేబి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇందులో లవ్ ఫెయిల్యూర్ కుర్రాడిగా అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. బేబి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆనంద్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో నటించే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మంచి హైప్ ఏర్పడింది. బేబి హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గం గం గణేశా. ఈ మూవీతో డైరెక్టర్ ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించగా.. జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే మూవీ ప్రమోషన్స్ లో వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తిని కలిగించింది చిత్రయూనిట్. ఇప్పుడు ఈ సినిమా (మే 31న) థియేటర్లలో గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే మూవీ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరీ ఆనంద్ సినిమాపై అడియన్స్ రివ్యూస్ ఏంటో చూసేద్దామా.

గం గం గణేశా మూవీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అంటూ ఒక్కమాటలో చెప్పేశారు ఓ నెటిజన్. క్రైమ్ కామెడీ మూవీ అయినా వెన్నెల కిషోర్ సిట్యుయేషనల్ కామెడీ అద్భుతంగా వర్క్ చేసిందని.. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటూ కామెంట్ చేశారు. రెగ్యూలర్ స్టోరీ అయిన ఉదయ్ శెట్టి డైరెక్షన్ బాగుందని.. ఇక ఆనంద్ హిట్స్ కొనసాగుతున్నాయని రివ్యూ ఇచ్చారు.

ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజీ అని.. మంచి క్లైమాక్స్ తోపాటు.. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్.. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్స్ ఎక్కువగా ఉన్నాయని ట్వీట్ చేశారు. ఇమ్మాన్యుయేల్, కృష్ణ చైతన్య తమ పాత్రలలో బెస్ట్ ఇచ్చారంటూ కామెంట్స్ చేశారు.