Anand Deverakonda: నా సినిమా కథలు నేనే సెలక్ట్ చేసుకుంటా.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ఆనంద్ దేవరకొండ..

| Edited By: Ravi Kiran

Nov 11, 2021 | 6:17 AM

దొరసాని", "మిడిల్ క్లాస్ మెలొడీస్" చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ.

Anand Deverakonda: నా సినిమా కథలు నేనే సెలక్ట్ చేసుకుంటా.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ఆనంద్ దేవరకొండ..
Anand Deverakonda
Follow us on

Anand Deverakonda: దొరసాని”, “మిడిల్ క్లాస్ మెలొడీస్” చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కొత్త సినిమా “పుష్పక విమానం” మొదటినుంచీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గీత్ సైని, శాన్వీ మేఘన నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆనంద్ దేవరకొండ మీడియాతో పంచుకున్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “దర్శకుడు దామోదర మా అన్నయ్య విజయ్ కు స్నేహితుడు. ఆయన చెప్పిన పుష్పక
విమానం కథ బాగా మా అందరికీ నచ్చింది. వేరే హీరోలను ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించాం. కుదరలేదు. పెళ్లాం లేచిపోయిన వ్యక్తి హీరో అవడం వాళ్లు సందేహించేలా చేసింది. మొదట్లో నాకు కూడా ఈ క్యారెక్టర్ చేయగలనా లేదా అనే డౌట్ వచ్చింది. టెస్ట్ షూట్ చేసిన తర్వాత నమ్మకం కుదిరి ఒప్పుకున్నాను.  పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంటాడు టీచర్ గా పనిచేసే చిట్టిలంక సుందర్ అనే వ్యక్తి. కానీ పెళ్లయ్యాక అతని ఆశలన్నీ తలకిందులు అవుతాయి. భార్య లేచిపోతుంది. కానీ ఆ విషయం మీద పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో హీరోకు కోపం, ఫ్రస్టేషన్ వస్తుంటాయి. చూసే వాళ్లకు కూడా హీరో మీద జాలి కలుగుతుంది.

పుష్పక విమానం ట్రైలర్ లో ఫన్ చూశారు. కానీ సినిమాలో ఫన్ ఫ్లస్ ఎమోషన్ రెండూ ఉంటాయి. నా క్యారెక్టర్ చాలా పద్దతిగా, సైలెంట్ గా ఉంటే హీరోయిన్ శాన్వి క్యారెక్టర్ చాలా బబ్లీగా, హుషారుగా ఉంటుంది. సునీల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయనది ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ ..తన గురించి మాత్రమే ఆలోచించుకునే స్వభావం. ఈ క్యారెక్టర్ లో సునీల్ అన్న సూపర్బ్ గా నటించారు. నవ్విస్తారు, భయపెడతారు.

గ్యులర్ హీరోగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దొరసాని సినిమా టైమ్ లో ఇలా ఉండాలని తెలీదు. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. అందులో కమర్షియల్ గా వెళ్లినా, లేక పూర్తిగా నేచురల్ గా వెళ్లినా ఫలితం మరోలా ఉండేది. కానీ మేము మధ్య దారిలో సినిమా చేయడం వల్ల దొరసాని అనుకున్నంత విజయం సాధించలేదు అనిపిస్తుంటుంది. మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా టైమ్ కు ఆ కథ ఎంత వర్కవుట్ అవుతుంది అనేది మాకు అంచనా లేదు. అంతా బొంబాయి
చట్నీ కథ అనేవారు. కానీ ఆ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని మాకు నమ్మకం. అది వర్కవుట్ అయ్యింది. నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నేనే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పుకొచ్చారు ఆనంద్ దేవరకొండ.

మరిన్ని ఇక్కడ చదవండి :  

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్