Tollywood: సిక్స్ ప్యాక్‏తో షాకిచ్చిన హీరో.. ఇది అస్సలు ఊహించలేదు బాస్.. ఎవరో తెలుసా.. ?

| Edited By: Basha Shek

May 19, 2024 | 10:15 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే హీరోగా వరుస సక్సెస్‏లు అందుకుంటున్నాడు. ప్రేమకథ సినిమాలతో యూత్‏కు దగ్గరవుతున్నాడు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుని ఫుల్ ఫాంలో ఉన్నాడు. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఊహించని లుక్ లో ఓ ఫోటో షేర్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించిన ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ?

Tollywood: సిక్స్ ప్యాక్‏తో షాకిచ్చిన హీరో.. ఇది అస్సలు ఊహించలేదు బాస్.. ఎవరో తెలుసా.. ?
Anand Deverakonda
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే హీరోగా వరుస సక్సెస్‏లు అందుకుంటున్నాడు. ప్రేమకథ సినిమాలతో యూత్‏కు దగ్గరవుతున్నాడు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుని ఫుల్ ఫాంలో ఉన్నాడు. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఊహించని లుక్ లో ఓ ఫోటో షేర్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించిన ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ? అతడే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆనంద్.. ఆ తర్వాత హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఆనంద్..దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, హైవే వంటి సినిమాలతో నటుడిగా అలరించినా.. అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. ఇటీవలే బేబీ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా తనదైన నటనతో ఆక్టటుకున్నారు. ఇక క్లైమాక్స్ లో ఎమోషన్ ఏ రేంజ్ లో పండించారు. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గం గం గణేశా సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. కొత్త డైరెక్టర్ ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. బేబీ సినిమా తర్వాత ఆనంద్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గం గం గణేశా మూవీ కోసం చాలా కష్టపడ్డానంటూ ఈరోజు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఆనంద్. అందులో సినిమా కోసం నిజంగా కండలు పెంచానంటూ తన సిక్స్ ప్యాక్ బాడీ ఫోటో షేర్ చేశారు. ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయని అందుకే ఇలా మారిపోయానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆనంద్ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. దేవరకొండ అబ్బాయి న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.