Pushpaka Vimanam: అల్లు అర్జున్ వదిలిన ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ట్రైలర్..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం పుష్పక విమానం. యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Pushpaka Vimanam: అల్లు అర్జున్ వదిలిన ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం ట్రైలర్..
Anand Devarakonda

Updated on: Oct 30, 2021 | 7:11 PM

Pushpaka Vimanam: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం పుష్పక విమానం. యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ.. దొరసాని అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆనంద్. దొరసాని సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా… ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఆ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేశాడు ఆనంద్. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పుష్పక విమానం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుంది. నూతన దర్శకుడు దామోదర ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా “పుష్పక విమానం” సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ వదిలిన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెళ్ళైన తర్వాత భార్య వేరొకరితో వెళ్ళిపోతే ఆ యువకుడు పడే అవస్థలను ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో మరోసారి ఆనంద్ తన నటనతో ఆకట్టుకోనున్నాడని అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్ దేవరకొండ “పుష్పక విమానం” సినిమాకు చేస్తున్న ప్రమోషన్ తో సినిమా ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతోంది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie: అన్నీ భాషల్లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ “సామీ సామీ” సాంగ్..

Ritu Varma: రితూ వర్మ లేటెస్ట్ ఫోటో షూట్.. అదరహో అనిపిస్తోన్న వరుడు కావలెను భామ

Deepthi Sunaina: చిలిపిగా కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ… దీప్తి సునయన లేటెస్ట్ పిక్స్