ఈ ఏడాది టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిన్న సినిమాల్లో బేబీ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ ఓవరాల్‌గా 96 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించింది. డైరెక్టర్ సాయి రాజేశ్‌కు బేబీ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే నిర్మాత ఎస్‌కేఎన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ చిన్న సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యువతను అమితంగా ఆకట్టుకున్న బేబీ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత బేబీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ధ్రువీకరించినట్లు సమాచారం. హిందీలో పెద్ద నిర్మాతలు రీమేక్ రైట్స్ కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన పేరు ఈ నిర్మాతకు ఉంది. బేబీ సినిమాలో అందరూ కొత్త వాళ్లు కావడం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా హిందీ రీమేక్‌లోనూ నటించేందుకు కొత్తతరం ఆర్టిస్టులను ఎంచుకోనున్నారని తెలుస్తోంది.
తెలుగులో బేబీ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్.. హిందీలో కూడా దర్శకత్వం వహిస్తున్నారట. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా ప్రముఖ హిందీ నటుడు, యానిమల్ విలన్ బాబీ డియోల్ కొడుకు అర్యమాన్‌ను అనంద్ పాత్రలో తీసుకుంటున్నారట. హీరోయిన్‌గా కొత్త అమ్మాయిను తీసుకుంటున్నారు. అలాగే సెకెండ్ హీరోగా మరొక కొత్త అబ్బాయిని తీసుకోన్నారట. త్వరలోనే హిందీ బేబీ రీమేక్ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
#BabyTheMovie emerges as a BLOCKBUSTER on OTT also, reaching a jaw-dropping 100 million views in just 32 hours on @ahavideoIN ! ❤️🔥#CultBlockbusterBaby is ruling the small screens, too! 🤩
Watch the heart-warming love story at your homes now! ❤️ pic.twitter.com/UEBoZaBAyA
— Geetha Arts (@GeethaArts) August 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.