
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన ఆర్జీవీ.. ఈ మధ్య వివాదాలతో ఎక్కువ సావాసం చేస్తున్నారు. సంచలనాలకు ఆర్జీవీ కేరాఫ్ అడ్రస్. రాజకీయ నాయకుల బయోపిక్ లను తెరకెక్కిస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్జీవీ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆర్జీవీ, అమితాబ్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సర్కార్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆర్జీవీ అమితాబ్ ను సర్కార్ అనే పిలుస్తున్నారు.
తాజాగా అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో అమితాబ్ ఆర్జీవీ డెన్ కు వెళ్లారు. ఆర్జీవీ డెన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే లోపాల చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. అందమైన అమ్మాయిల ఫొటోలతోపాటు ఆర్జీవీ రేర్ ఫోటో ఫ్రేమ్స్ గోడలకు కనిపిస్తాయి. ఆర్జీవీ తన డెన్ లో చాలా మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు.
తాజాగా ఆర్జీవీ డెన్ లో అమితాబ్ సందడి చేశారు. డెన్ లో బిగ్ బి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్జీవీ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. సక్సెస్ లేక అమితాబ్ సతమతం అవుతున్న సమయంలో సర్కార్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఆర్జీవీ. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా సర్కార్ రాజ్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత సర్కార్ 3 సినిమా తో ప్రేక్షకులను పలకరించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా ఇప్పుడు ఆర్జీవీ డెన్ కు బిగ్ బి రావడంతో తో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా మార్చ్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఆర్జీవీ తోపాటు దాసరి కిరణ్ కూడా అమితాబ్ ను కలిశారు. ఆ ఫోటోను షేర్ చేసిన ఆర్జీవీ.. నేను, దాసరి కిరణ్ కలిసి అమితాబ్‌తో వ్యూహం రచించాము అని రాసుకొచ్చారు. దాంతో వ్యూహం ప్రమోషన్స్ కోసం అమితాబ్‌ను ఆర్జీవీ దింపారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
SARKAR @SrBachchan in MY SEAT at RGV DEN pic.twitter.com/WxUoMIqJuc
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024
SHIVA ing with @SrBachchan at RGV DEN 🔥🔥🔥 pic.twitter.com/RIKwFeh7fK
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024
Me and Dasari Kiran Kumar VYOOHAM ing with SARKAR Amitabh Bachchan at RGV DEN 💐💐💐 pic.twitter.com/jnboZKlhHc
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.