Amitabh Bachchan: అమితాబ్ ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క పర్సన్ ఎవరో తెల్సా..?

సోషల్‌మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటారు అమితాబ్‌ బచ్చన్‌. ఆయను ఫేస్‌బుక్‌ ఖాతాను దాదాపు 38 లక్షల మంది నెటిజన్లు ఫాలో అవుతుంటారు. మరి అమితాబ్‌ మాత్రం కేవలం ఒకే ఒకర్ని అనుసరిస్తున్నారు. ఆ ఒక్క పర్సన్ ఎవరో మీకు తెల్సా..?

Amitabh Bachchan: అమితాబ్ ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క పర్సన్ ఎవరో తెల్సా..?
Amitabh Bachchan

Updated on: Mar 10, 2024 | 3:53 PM

అమితాబ్ అంటే వ్యక్తి కాదు ఓ శక్తి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనో లెజెండో. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి.. జనాలు చేత జేజేలు కొట్టించుకున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో కీలక పాత్రలో బిగ్ బీ మెరిసిన విషయం తెలిసిందే. ఇక అమితాబ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్. ఆయన్ను ఫేస్‌బుక్‌లో అయితే  38 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ సినీ లెజెండ్ మాత్రం కేవలం ఒక్కర్నే ఫాలో అవుతున్నారు. అది కూడా ఏ ఫ్యామిలీ మెంబరో, సినిమా స్టారో లేక పొలిటీషన్ అనుకుంటే మీరు పొరబడినట్లే.

కంటి చూపులేని ముంబైకి చెందిన ఓ సామాన్యురాలను అమితాబ్ ఫాలో అవుతున్నారు. ఆ అమ్మాయి పేరు అవ్నీ రాథీ. పోయిన ఏడాది ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొని అమితాబ్‌కి మరింత చేరువైంది. ఉన్నత చదువులు చదువుకున్న అవ్నీ.. పాటలు రాసి పాడుతుంటుంది. వాద్య పరికరాల వాయించడంలో కూడా నైపుణ్యత ఉంది. సంగీతంలో కూడా రాణిస్తోంది. స్టేజీ షోలలో కూడా తను ధృడ సంకల్పంతో ప్రదర్శన ఇస్తుంది. అవ్నీ టాలెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్  మెచ్చిన అమితాబ్‌ ప్రశంసాపూర్వంగా ఆమె ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారట.

కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న.. ‘కల్కి 2898 AD’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు అమితాబ్ బచ్చన్. ఆయన ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది మే 9న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.