Amala Paul: పుట్టినరోజు వేళ అమలా పాల్‏కు పెళ్లి ప్రపోజ్.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే..

కొన్నాళ్లకు ప్రేమ, పెళ్లి, అంతలోనే విడాకులు తీసుకోవడంతో అమలా పాల్ వార్తలలో నిలిచింది. డివోర్స్ తర్వాత అమలా పాల్ ఇప్పటివరకు సింగిల్‏గానే ఉంటుంది. ఆ మధ్యన అమలా పాల్ ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. పంజాబీ సింగర్‏తో ప్రేమలో ఉందని.. ఇద్దరికి పెళ్లై పోయిందంటూ కొన్ని ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ ఓ ప్రకటన కోసమే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక చాలా రోజులుగా అమలా పాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది.

Amala Paul: పుట్టినరోజు వేళ అమలా పాల్‏కు పెళ్లి ప్రపోజ్.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే..
Amala Paul

Updated on: Oct 26, 2023 | 3:18 PM

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలా పాల్. ఇద్దరమ్మాయిలతో.. మైనా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. కొన్నాళ్లు తెలుగులో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేసింది. కొన్నాళ్లకు ప్రేమ, పెళ్లి, అంతలోనే విడాకులు తీసుకోవడంతో అమలా పాల్ వార్తలలో నిలిచింది. డివోర్స్ తర్వాత అమలా పాల్ ఇప్పటివరకు సింగిల్‏గానే ఉంటుంది. ఆ మధ్యన అమలా పాల్ ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. పంజాబీ సింగర్‏తో ప్రేమలో ఉందని.. ఇద్దరికి పెళ్లై పోయిందంటూ కొన్ని ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ ఓ ప్రకటన కోసమే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక చాలా రోజులుగా అమలా పాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా సింగిల్‏గా ఉంటున్న అమలా పాల్..ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఈరోజు (అక్టోబర్ 26న) అమలా పాల్ బర్త్ డే సందర్భంగా పెళ్లి గురించి బయటపెట్టింది. ఆమె పుట్టిన రోజు వేడుకలను ఒక పబ్బులో సెలబ్రెట్ చేసిన తన స్నేహితుడు జగత్ దేశాయ్.. అదే సమయంలో పెళ్లి ప్రపోజల్ చేశారు. ఇక వెంటనే అమలా పాల్ సైతం ఓకే చెప్పారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. నా రాణి ఎస్ చెప్పింది. పెళ్లి గంటలు మోగుతున్నాయి. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

అమలా పాల్ పెళ్లి చేసుకోబోయే జగత్ దేశాయ్.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కనిపించడం లేదు. కానీ అమలాకు మంచి స్నేహితుడని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితమే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించకుండా సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆమె రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.