Allu Arjun: మామయ్య సమక్షంలో పిల్లనిచ్చిన మామయ్య.. పాన్ ఇండియా స్టార్ బన్నీకి ఘన సన్మానం.. పిక్స్ వైరల్

Allu Arjun: స్టైలిస్ హీరో, యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పార్క్ హయత్ హోటల్(Park Hyatt hotel) లో ఘన సన్మానం జరిగింది. అల్లు అర్జున్, సుకుమార్(Sukumar( దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఇటీవల రిలీజై..

Allu Arjun: మామయ్య సమక్షంలో పిల్లనిచ్చిన మామయ్య.. పాన్ ఇండియా స్టార్ బన్నీకి ఘన సన్మానం.. పిక్స్ వైరల్
Chiranjeevi Allu Arjun

Updated on: Mar 21, 2022 | 2:41 PM

Allu Arjun: స్టైలిస్ హీరో, యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పార్క్ హయత్ హోటల్(Park Hyatt hotel) లో ఘన సన్మానం జరిగింది. అల్లు అర్జున్, సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఇటీవల రిలీజై.. ఘన విజయం సొంతం చేసుకుంది. తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో నటించిన బన్నీ.. పుష్పతో నార్త్ లో కూడా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దేశ విదేశాల్లోని సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ కు రీల్ చేస్తూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్‌ ను బన్నీ అండ్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంది. స్వయానా అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామగారు ఘనంగా పార్టీ ఇచ్చారు. బ‌న్నీ భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి త‌న అల్లుడు అల్లు అర్జున్ కోసం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హెటల్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా విచ్చేశారు.

ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దంపతుల సమక్షంలో అల్లు అర్జున్‌ను స్నేహారెడ్డి తండ్రి ఘనంగా సత్కరించి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు పార్టీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, అల్లు అరవింద్‌ దంపతులు, టి సుబ్బిరామిరెడ్డి, భానుప్రకాష్‌ (ఐఏఎస్‌) త్రివిక్రమ్‌, హరశ్‌ శంకర్‌, క్రిష్‌, గుణశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం రవికుమార్‌ గజమాలతో బన్నీని సత్కరించారు.  ప్రస్తుతం పుష్ప సీక్వెల్ గ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు.

Also Read: Watch Video: బెంజ్ కార్ షోరూంలోకి ప్రవేశించిన చిరుత.. భయంతో వణికిపోయిన సిబ్బంది.. చివరకు..

Janasena: సంక్షేమ పాలన అంటే ఇదేనా.. జగన్ సర్కార్‌పై జనసేన విమర్శనాస్త్రాలు