Allu Aravind: తనయుడితో కలిసి ఆర్ట్ గ్యాలరీలో సందడి చేసిన అల్లు అరవింద్.. ఫోటో వైరల్..

అల్లు అరవింద్.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‏లో ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.

Allu Aravind: తనయుడితో కలిసి ఆర్ట్ గ్యాలరీలో సందడి చేసిన అల్లు అరవింద్.. ఫోటో వైరల్..
Allu Aravind

Updated on: Nov 01, 2021 | 6:13 PM

అల్లు అరవింద్.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‏లో ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అటు సినిమాలతో ఎప్పటికప్పుడు బిజీగా ఉండే అల్లు అరవింద్.. తన కుటుంబం కోసం దొరికిన కొద్ది సమయాన్ని కేటాయిస్తుంటారు. తనకున్న కాస్త విరామ సమయంలోనూ తన కుటుంబంతో ఎంతో జాలీగా సంతోషంగా గడిపేస్తుంటారు. అలాగే తనయులతో కలిసి ఈవెంట్లలోనూ సందడి చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు అల్లు అర్జు్న్.. అల్లు శిరీష్‏తో కలిసి సందడి చేసిన అల్లు అరవింద్.. తాజాగా తన పెద్ద కుమారుడితో కలిసి పెయింటింగ్ ఆర్టిస్ట్‏గా మారిపోయారు. తన పెద్ద కుమారుడు అల్లు బాబీతో కలిసి ఆదివారం శిరీష్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్‏ను సందర్శించారు.

ఇద్దరూ కలిసి బ్రష్ పట్టి ఓ పెయింటింగ్ వేశారు. ఆ తర్వాత.. అదే పెయింటింగ్ పక్కన నిలబడి ఫోటోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు బాబీ తన ఇన్‏స్టాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అల్లు అరవింద్ గీత్ ఆర్ట్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే.. అల్లు బాబీ కూడా ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గని సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. జగపతి బాబు, సునీల్, ఉపేంద్ర కీలకపాత్రలలో నటిస్తున్నారు. డిసెంబర్ 3న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: భయంకరమైన రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ, రన్నరప్ స్పాట్ డెడ్.. హృదయవిదారక దృశ్యాలు..

Jr.NTR: జిమ్‏లో ఎన్టీఆర్ చేసే కసరత్తులు చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ రేర్ ఫొటోస్, ఆసక్తికర విషయాలు మీ కోసమే