Allu Arjun: నెట్టింట వైరలవుతున్న అల్లు అర్జున్ కారు టైర్స్ ఫోటోస్.. ఇంతకీ అందులో అంత స్పెషాలిటీ ఏంటీ ?..

|

Feb 11, 2024 | 7:27 AM

బన్నీ ఫాల్కన్ వ్యాన్ ధర దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. అందులో లివింగ్ ఏరియా, ప్రీమియం లాంజ్, బెడ్ రూమ్, ప్రత్యేకంగా మేకప్ రూమ్ ఉన్నాయి. నలుపు, తెలుపు రంగులతో కలిగిన ఆ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఎంతో ప్రశాంతతను కలిగిస్తుందట. ఇవే కాకుండా బన్నీ వద్ద సంపన్నమైన BMW X5, జాగ్వార్ XJL ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఆటో మొబైల్స్ పట్ల బన్నీ ఉన్న ప్రేమ, ఆసక్తి ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.

Allu Arjun: నెట్టింట వైరలవుతున్న అల్లు అర్జున్ కారు టైర్స్ ఫోటోస్.. ఇంతకీ అందులో అంత స్పెషాలిటీ ఏంటీ ?..
Allu Arjun
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. పేరుకు తగ్గట్టే.. తన స్టైల్ ఆఫ్ లివింగ్‏తో యూత్ ఐకాన్ అనిపించుకున్నారు. యాక్టింగ్, డాన్స్ అన్నింట్లోనూ తనకంటూ ఓ స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటారు. బన్నీకి ఆటో మొబైల్స్ అంటే అమితమైన ఇష్టం. ఈ విషయాన్ని గతంలో తన వ్యానిటీ వ్యాన్ తో నిరూపించుకున్నారు. ఎప్పుడూ తన స్టైల్ ఆఫ్ లివింగ్ స్వయంగా దగ్గరుండి డిజైన్ చేయించుకుంటారని ఈ వ్యాన్ తో నిరూపించుకున్నారు. బన్నీ ఫాల్కన్ వ్యాన్ ధర దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. అందులో లివింగ్ ఏరియా, ప్రీమియం లాంజ్, బెడ్ రూమ్, ప్రత్యేకంగా మేకప్ రూమ్ ఉన్నాయి. నలుపు, తెలుపు రంగులతో కలిగిన ఆ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఎంతో ప్రశాంతతను కలిగిస్తుందట. ఇవే కాకుండా బన్నీ వద్ద సంపన్నమైన BMW X5, జాగ్వార్ XJL ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఆటో మొబైల్స్ పట్ల బన్నీ ఉన్న ప్రేమ, ఆసక్తి ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ విషయం నెట్టింట తెగ వైరలవుతుంది. అదేంటంటే.. బన్నీ తన కారు విషయంలో తన స్టైల్ ఆఫ్ లివింగ్ డిజైన్ చేయించుకున్నారు. అంటే తన కారు టైర్స్ పై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారు. స్టాప్ మార్క్ సిగ్నేచర్ ‘AA’ మార్క్ వేయించారు. తన సినిమాలకు.. బిజినెస్ లకు ఈ సంతకమే చేస్తుంటారు. ఇక అదే అల్లు అర్జున్ లోగోగా మారింది. ఇప్పుడు అదే లోగో ను తన కారు టైర్స్ పై డిజైన్ చేయించాడు బన్నీ. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలను కొందరు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బన్నీ కెరీర్ ను మలుపుతిప్పింది. ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ లో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.