
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ కొన్నాళ్లుగా శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. కూతురు అర్హతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 7న గురువారం ఉదయం కూతురుతో కలిసి తిరుమల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్నేహ. దర్శనంం అనంతరం దేవాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు అర్హ ప్రవర్తించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అర్హకు సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్స్ వారిద్దరిని చుట్టుముట్టారు. ముఖ్యంగా అర్హను ఫోటోస్ తీసేందుకు ప్రయత్నించారు.
కానీ అర్హ మాత్రం తన ముఖం కనిపించకుండా దాచుకుంటూ స్నేహారెడ్డి వెనకకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కాసేపటికి తన తల్లి చున్నీని ముఖానికి అడ్డుపెట్టుకుని నడిచింది. ఇక మరోసారి తన చేతులను ముఖానికి అడ్డపెట్టి నడుచుకుంటూ వచ్చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అర్హ చేసిన క్యూట్ అల్లరి పని ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
Sneha garu visited tirumala today along with our little princess #AlluArha 🤍#Pushpa2TheRule @alluarjunpic.twitter.com/XkPgQBeZFD
— Sumanth (@SumanthOffl) December 7, 2023
ఇప్పటికే అల్లు అర్జున్ వారసురాలిగా శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యింది అర్హ. ఈ సినిమాలో భరతుడి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తెలుగులో ఎంతో చక్కగా డైలాగ్స్ చెప్పి అందరిని ఆకట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషించగా.. మోహన్ బాబు, మధుబాల, గౌతమి కీలకపాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే అర్హకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు స్నేహరెడ్డి. ఇక బన్నీ సైతం అప్పుడప్పుడు తన కూతురు అల్లరి వీడియోస్ నెట్టింట పంచుకుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.