అల్లు అరవింద్, బన్నీల మధ్య రెమ్యూనరేషన్ సీక్రెట్స్..!

|

Feb 12, 2020 | 9:33 PM

చాలా రోజులు తర్వాత అల వైకుంఠపురం మూవీతో హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పనిలో పనిగా త్రివిక్రమ్-బన్నిలు కలిసి ఇదే మూవీతో హ్యాట్రిక్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. పొంగల్‌కి రిలీజైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఆ జోష్‌లో ఉన్న సదరన్ స్టార్ హిందీ మీడియాతో ముచ్చటించి..పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమ దేశంలో పెద్దదన్న బన్ని, అక్కడి స్టార్స్‌ని ఎప్పుడూ అడ్మైర్ చేస్తామని తెలిపారు. హిందీ […]

అల్లు అరవింద్, బన్నీల మధ్య రెమ్యూనరేషన్ సీక్రెట్స్..!
Follow us on

చాలా రోజులు తర్వాత అల వైకుంఠపురం మూవీతో హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పనిలో పనిగా త్రివిక్రమ్-బన్నిలు కలిసి ఇదే మూవీతో హ్యాట్రిక్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. పొంగల్‌కి రిలీజైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఆ జోష్‌లో ఉన్న సదరన్ స్టార్ హిందీ మీడియాతో ముచ్చటించి..పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమ దేశంలో పెద్దదన్న బన్ని, అక్కడి స్టార్స్‌ని ఎప్పుడూ అడ్మైర్ చేస్తామని తెలిపారు. హిందీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నానని..మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. ఇక కేరళలో తనకున్న క్రేజ్‌పై కూడా స్పందించాడు బన్నీ. తెలుగులో ఫ్యాన్ బేస్‌ని చిరంజీవి గారి దగ్గర నుంచి చూస్తున్నామని..కానీ ఒక డిఫరెంట్ ఏరియా నుంచి ఇలా ఫాలోయింగ్ ఉండటం తనకి కొత్తగా ఉందని పేర్కొన్నాడు.

ఇక తను హీరో కాకపోవడానికి ముందు పియానో టీచర్, మార్షల్ ఆర్ట్స్ టీచర్, యానిమేటర్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ అవ్వాలనుకున్నాడట బన్ని. అంతేకాదు నాసాలో కూడా తన సత్తా చాటుదామని కలలు కన్నాడట. ఇక తన తండ్రి ఫిల్మ్ ప్రొడ్యూసర్ తనకు ఇచ్చే రెమ్యూనరేషన్‌ గురించి కూడా సీక్రెట్స్ చెప్పేశాడు. తన తండ్రి స్మార్ట్ ప్రొడ్యూసర్ అని, అందుకే సినిమా విడుదలకు ముందే తనకు ముందు డబ్బులు చెల్లిస్తాడని తెలిపాడు. ఒకవేళ అలా చెయ్యకుంటే..ఎక్కువ లాభాలు వస్తే, తాను ఎక్కువ డబ్బులు అడుగుతానని తన తండ్రి భయంగా చెప్పుకొచ్చాడు. తమ మధ్య రెమ్యూనరేషన్ విషయంలో సున్నితమైన గీతలు ఉంటాయని తెలిపాడు. మీ నాన్నకు మీరు డిస్కౌంట్ ఇవ్వరా అని యాంకర్ ప్రశ్నించగా..మా నాన్న నాకు బోనస్ ఇవ్వనప్పడు, నేను తనకు డిస్కౌంట్ ఎందుకిస్తానని సరదాగా వ్యాఖ్యానించాడు.