Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని దక్కించుకొని దూసుకుపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా సాగుతుంది. గంధపుచెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్లో అదరగొట్టాడు బన్నీ. ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న మెప్పించింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజు రోజుకీ మరింత జోష్తో రికార్డ్స్ కలెక్షన్స్ కురిపిస్తోంది.
పుష్ప సినిమా విడుదలై వారం రోజులు అవుతున్నా థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా వారం రోజుల్లో భారీ వసూళ్లను దక్కించుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా వారం రోజుల్లో 229 కోట్లు వసూల్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపు 100 కోట్లవరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ నిర్మించారు.
Blockbuster First Week for #PushpaTheRise ??
With MASSive 229 CR Gross worldwide, #PushpaTheRise enters into the 2nd week grandly ?#PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial pic.twitter.com/OifsbnXgJh
— BA Raju’s Team (@baraju_SuperHit) December 24, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :