Pushpa Update: అల్లు అర్జున్ హీరోగా తరకెక్కుతోన్న ‘పుష్ఫ’ సినిమాపై అంచనాలు ఎంతలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం, ఇందులో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్‌గా మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపిస్తుండడం వంటి అంశాలు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇతర భాషల్లోనూ బన్నీకి ఉన్న క్రేజ్‌ను వాడుకోవడానికి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని విలన్ పాత్రను పరిచయం చేశారు చిత్ర యూనిట్.
పుష్ఫరాజ్‌తో ఢీకొట్టే పాత్రలో నటుడు ఫహద్ నటిస్తున్నాడు. తాజాగా చిత్రయూనిట్ ‘విలన్ ఆఫ్ పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఫహద్.. భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు. డిఫ్రంట్ లుక్‌తో కనిపిస్తోన్న ఫహద్ పాత్ర సినిమాలో చాలా గంభీరంగా ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్, ఫహద్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపాడేస్తాయని సమాచారం. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోన్న విషయం తెలిసిందే.
నిజానికి చిత్రీకరణ ప్రారంభించిన సమయంలో ఈ సినిమాను ఒకే పార్ట్‌గా విడుదల చేయాలని భావించారు. కానీ నిడివి పెరగడంతో రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే మొదటి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Meet the #VillainOfPushpa ?
The most talented #FahadhFaasil turns into menacing BHANWAR SINGH SHEKHAWAT(IPS) to lock horns with our #PushpaRaj ?#PushpaTheRise #ThaggedheLe ?@alluarjun @iamRashmika @Dhananjayaka @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/P0yNiX0Ruo
— Pushpa (@PushpaMovie) August 28, 2021
Thalaivi Movie: జయలలిత, ఎమ్‌జీఆర్‌ల ప్రణయ గీతం… తలైవి మరో సాంగ్ టీజర్‌ను చూశారా.?