ఇది సార్ పుష్పగాడి రేంజ్.. ఫస్ట్ డేతోనే నాన్‌ బాహుబలి రికార్డులు బ్రేక్..

| Edited By: Ravi Kiran

Dec 06, 2024 | 8:50 PM

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే ఏ మాత్రం తడుముకోకుండా రాజమౌళి అనేస్తాం. కానీ ఆ రాజమౌళిని కూడా భయపెట్టే దర్శకుడు ఒకరున్నారు. ఈ విషయాన్ని జక్కన్న స్వయంగా చెప్పారు.

ఇది సార్ పుష్పగాడి రేంజ్.. ఫస్ట్ డేతోనే నాన్‌ బాహుబలి రికార్డులు బ్రేక్..
Pushpa 2
Follow us on

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే ఏ మాత్రం తడుముకోకుండా రాజమౌళి అనేస్తాం. కానీ ఆ రాజమౌళిని కూడా భయపెట్టే దర్శకుడు ఒకరున్నారు. ఈ విషయాన్ని జక్కన్న స్వయంగా చెప్పారు. ఓ సినిమా చూసి ఆ దర్శకుడు ఎప్పటికైన తనకు కాంపిటీషన్ అవుతాడని ఫీల్ అయ్యారు. అందుకే అతడి మీద ఈగో పెంచుకొని మనసు పాడు చేసుకోకూడాదని తనతో ఫ్రెండ్‌ షిప్‌ చేశాడు. తన ప్రతీ సక్సెస్‌లో పక్కనే ఉన్నారు. ఫైనల్‌ గా అప్పట్లో రాజమౌళి పడిన భయమే ఇప్పుడు నిజమైంది.

జక్కన్న భయాన్ని నిజం చేసిన ఆ దర్శకుడు సుకుమార్‌. వన్‌ నేనొక్కడినే సినిమా సమయంలో జక్కన్న, సుక్కు ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న టైమ్‌ లో తనను రాజమౌళి ఎలా ప్రోత్సహించారో గుర్తు చేసుకున్నారు సుకుమార్‌. జక్కన్న ఇచ్చిన సపోర్ట్‌ కు మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు చెప్పారు.

అదే ఇంటర్వ్యూలో సుకుమార్ మీద తన అంచనా ఏంటో క్రిస్టల్‌ క్లియర్‌ గా రివీల్ చేశారు రాజమౌళి. జగడం సినిమా రిలీజ్ అయినప్పుడే సుకుమార్ తనకు కాంపిటీషన్ అవుతాడని ఫీల్ అయ్యా అన్నారు. అందుకే తనని కాంపిటీషన్‌ గా ఫీల్ అయి బుర్ర పాడు చేసుకోవటం కన్నా… తనతో ఫ్రెండ్‌ షిప్ చేయటం బెటర్ అని ఫీల్ అయ్యానని, అందుకే సుకుమార్‌ కు దగ్గరయ్యా అన్నారు.

ఫైనల్‌ గా జక్కన్న భయం నిజమైంది. ఇప్పటికే వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజమౌళి రికార్డ్‌ లను టార్గెట్‌ చేశారు సుకుమార్‌. ఇప్పటి వరకు తొలి రోజు వసూళ్లు విషయంలో నెంబర్‌ వన్‌ గా ఉన్న జక్కన్నను వెనక్కి నెట్టేశారు. ట్రిపులార్ పేరిట ఉన్న 223.5 కోట్ల గ్రాస్‌ రికార్డ్‌ ను వెనక్కి నెట్టి 294 కోట్ల డే వన్‌ వసూళ్ల రికార్డ్‌ తో కొత్త చరిత్ర సృష్టించారు. ఇక మీదట డే వన్‌ వసూళ్ల విషయంలో నాన్‌ బాహుబలి, నాన్‌ రాజమౌళి రికార్డ్ అన్న పదాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారు.

పుష్పరాజ్‌ హవా రోజు రోజు పెరుగుతుండటం, ఇప్పట్లో భారీ సినిమా లేవీ రిలీజ్‌ కు లేకపోవటంతో పుష్ప రాజ్‌ మరిన్ని రికార్డ్‌ లను తన ఖాతాలో వేసుకోవటం పక్కా అంటున్నారు అభిమానులు. మరి అభిమానుల అంచనాలు నిజం చేస్తున్న ఇండియాస్‌ బిగ్గెస్ట్ గ్రాసర్‌ గా పుష్ప 2 నిలుస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..