Pushpa 2: ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..

|

Apr 24, 2024 | 7:37 PM

పుష్ప2 సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ తో ప్రేక్షకులను అలరించిన మూవీ టీమ్ ఇప్పుడు మరో అప్‌డేట్‌ను అందించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.   పుష్ప 2 ఫస్ట్ సాంగ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Pushpa 2: ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
Pushpa 2
Follow us on

ప్రస్తుతం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 సినిమా ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ ఇప్పటికే మొదలైంది. పుష్ప2 సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ తో ప్రేక్షకులను అలరించిన మూవీ టీమ్ ఇప్పుడు మరో అప్‌డేట్‌ను అందించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.   పుష్ప 2 ఫస్ట్ సాంగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ప్రోమో విడుదల చేశారు మూవీ టీమ్. దానితో పాటు  రిలీజ్ డేట్ ను కూడా పేర్కొన్నారు.

‘పుష్ప 2’ తొలి పాట లిరికల్ వీడియోను మే 1న విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలో ‘శ్రీవల్లీ..’, ‘ఊ అంటావా మావా..’ వంటి పాటలతో కొత్త క్రేజ్ క్రియేట్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పుడు ‘పుష్ప 2’ పాటలపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సాంగ్ విడుదలయ్యాక అభిమానుల హైప్ మరింత పెరగడం ఖాయం.

పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దాని సీక్వెల్‌ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి రెడీ అవుతుంది. ఆగస్టు 15న ‘పుష్ప 2’ విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వందల కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే విడుదలైన గంగమ్మ జాతరకు సంబంధించిన ప్రోమో సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.