“లారీడ్రైవర్”గా మారిన బన్నీ
స్కీన్ ప్రెజెన్స్‌లో అదరగొట్టే బన్నీ, స్క్రీన్ ప్లేతో కుమ్మేసే సుకుమార్.. మరోసారి జతకట్టనున్న విషయం తెలిసిందే. కన్నడ బ్యూటీ రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓ మేజర్ అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్‌ని ఊపేస్తోంది. అదేంటంటే, ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. అవును.. మీరు విన్నది నిజమే.. మోస్ట్ స్టయిలిష్ స్టారేంటి, ఇలా లారీ డ్రైవర్ పాత్ర వేయడమేంటీ అనుకుంటున్నారు కదూ.. అయితే ఒక్కసారి […]
స్కీన్ ప్రెజెన్స్‌లో అదరగొట్టే బన్నీ, స్క్రీన్ ప్లేతో కుమ్మేసే సుకుమార్.. మరోసారి జతకట్టనున్న విషయం తెలిసిందే. కన్నడ బ్యూటీ రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓ మేజర్ అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్‌ని ఊపేస్తోంది. అదేంటంటే, ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. అవును.. మీరు విన్నది నిజమే.. మోస్ట్ స్టయిలిష్ స్టారేంటి, ఇలా లారీ డ్రైవర్ పాత్ర వేయడమేంటీ అనుకుంటున్నారు కదూ.. అయితే ఒక్కసారి రంగస్థలం సినిమాను గుర్తు చేసుకొండి. రామ్ చరణ్‌ని కూడా అంత డీగ్లామర్డ్ రోల్‌లో చూపించిన సుకుమార్.. మరోసారి బన్నీతో అలాంటి ప్రయోగమే చేయిస్తున్నాడని టాక్. ఈ మూవీ మొత్తం నల్లమల్ల అడవుల్లో జరిగే రెడ్ సాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుందట. అందుకే బన్నీని లారీ డ్రైవర్ పాత్రలో చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక రష్మిక ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటించనుందట.
రష్మిక మండన్నకు ఈ పాత్ర ఎంతగానో నచ్చి ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిందని.. ఇప్పటికే యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ సినిమాకి మరో అస్సెట్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. విలన్ పాత్రలో విజయ్ ఎంతవరకూ మెప్పిస్తాడో స్క్రీన్ పైనే చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.