Allu Arjun: ఇదొక అద్భుతమైన సినిమా.. చూసి ఎంజాయ్ చేయండి.. ఆ స్టార్ హీరో మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు

అల్లు అర్జున్ మరో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ మధ్యన లిటిల్ హార్ట్స్, కాంతార 2, శివ 4K సినిమాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు బన్నీ. తాజాగా మరో సినిమాపై ప్రశంసలు కురిపించాడు ఐకాన్ స్టార్.

Allu Arjun: ఇదొక అద్భుతమైన సినిమా.. చూసి ఎంజాయ్ చేయండి.. ఆ స్టార్ హీరో మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు
Allu Arjun

Updated on: Dec 12, 2025 | 8:25 PM

పుష్ప 2 తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించనుంది. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సినిమాను క్టును నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గురువారం (డిసెంబర్ 11) సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో మెరిశాడు. తనకు సొంతంగా ‘ఏఏఏ సినిమాస్’ ఉన్నప్పటికీ ఓ సినిమా చూసేందుకు మహేష్ థియేటర్‌కు వెళ్లడం విశేషం. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న ధురంధర్ సినిమాను చూసిన అల్లు అర్జున్ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇవి కూడా చదవండి

 

ఇప్పుడే ‘ధురంధర్ సినిమా చూశాను. అద్భుతమైన నటన, అత్యున్నత సాంకేతిక విలువలు, మంచి సౌండ్‌ ట్రాక్‌లతో రూపొందిన బ్రిలియంట్ సినిమా ఇది. నా బ్రదర్ రణ్‌వీర్ సింగ్ స్క్రీన్ ప్రజెన్స్ అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. తన వైవిధ్యంతో సినిమాను అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్‌ల నటన హైలెట్ గా నిలిచింది. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ గారు.. ఫుల్ స్వాగ్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నాకైతే బాగా నచ్చింది. చూసి ఎంజాయ్ చేయండి గాయ్స్అని రాసుకొచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

 

కాగా ధురంధర్ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లుతోంది..

ధురంధర్ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి