Allu Arjun: ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. సామాజిక సేవలో ప్రత్యేకత చాటుకుంటోన్న అల్లు అర్జున్ అభిమానులు
అభిమానం అనే పదానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. అసోసియేషన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏటా ఒక మంచి పని చేపట్టాలన్న బన్నీ అభిమానుల నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు దానిని సమర్థవంతంగా అమలు చేయడం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.

సొసైటీ బాగు కోసం ముందడుగు వేస్తూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్ నెస్ ఈవెంట్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మద్ధతుగా నిలిచింది. ఈ కార్యక్రమాల ద్వారా 3 లక్షలమంది యువతులకు చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమాలను ఎఎఎఫ్ఎ నిర్వహించింది. సామాజిక బాధ్యత గల అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించారు. హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించడంలో బాలికలకు, యువతులకు ఆరోగ్యకరమైన భవితను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఒక గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం కోసం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానుల ఒక్కటవడం విశేషం.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు రాకా సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రష్మిక మందన్నా, మృణాళ్ ఠాకూర్ తదితర స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ప్రతిష్ఠాత్మక తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా రాకా సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ప్రతి పాఠశాలకు వెళ్లి..
📌 HPV Awareness Program – Event Details
Date:September 8th, 2026 State Name: Andhra Pradesh District Name: Srikakulam Event Location: Narasannapeta
AAFA Active Volunteers: Team AA Narasannapeta – Anil, Koushik, Devashish, Dilli, Lokesh, Nivas, Srinu, Siva, Vijay
Schools… pic.twitter.com/kUy4tyrzKf
— Allu Arjun Fans Association (@AAFAOnline) September 10, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




