AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే.. ఇంటి వద్ద అభిమానుల సందడి.. వీడియో ఇదిగో..

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా మొదలైన ప్రయాణం.. ఇప్పుడు పుష్ప మూవీతో ప్రపంచస్థాయికి చేరింది. ఈరోజు బన్నీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇదివరకే చాలా మంది అభిమానులు బన్నీ ఇంటి వద్ద సందడి చేస్తున్నారు.

Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే.. ఇంటి వద్ద అభిమానుల సందడి.. వీడియో ఇదిగో..
Allu Arjun Home
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2026 | 10:45 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా పుట్టినరోజు శుభాకాంక్షలతో నిండిపోగా, హైదరాబాద్‌లో ఫ్యాన్స్ ఈ ప్రత్యేకమైన రోజును పూర్తి చేసుకోవడానికి ఉత్సాహంతో బన్నీ ఇంటికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆయనను చూడటానికి జూబ్లీ హిల్స్‌లోని ఆయన బంగ్లా బయట భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. బన్నీ ఇంటి ముందు టపాసులు కాల్చి.. పూజలు చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఉదయం నుంచే అల్లు అర్జున్‌ ఇంటి దగ్గరకి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఫ్యాన్స్‌.. తమ అభిమాన నటుడిని చూసేందుకు ఉత్సాహం చూపించారు. పుష్పరాజ్‌ గెటప్‌లో బన్నీకి కనిపించి పుట్టినరోజు విషెస్‌ చెప్తున్నారు కొందరు హార్డ్ కోర్‌ ఫ్యాన్స్. సోషల్‌ మీడియాలోనూ బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మరోవైపు సినీతారలు బన్నీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాపైనే అందరి చూపు ఉండిపోయింది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivas Rao: చాలా మంది నటులు ఉన్నారు.. కానీ ఆ హీరోకు ఉన్న సత్తా ఎవరికీ లేదు.. కోట శ్రీనివాస రావు..

Follow Us
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..