Pushpa 2: అసలు పుష్ప ఎక్కడ ?.. అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న గ్లింప్స్..

ఇక కాసేపటి క్రితం ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ ? అంటూ వాయిస్ వినిపిస్తుండగా.. పుష్ప 2పై మరిన్ని అంచనాలు పెంచేసింది.

Pushpa 2: అసలు పుష్ప ఎక్కడ ?.. అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న గ్లింప్స్..
Pushpa 2

Updated on: Apr 05, 2023 | 12:02 PM

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 5 నేషనల్ క్రష్ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా.. ఈ చిత్రం నుంచి శ్రీవల్లి లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక కాసేపటి క్రితం ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ గ్లిమ్ప్స్ లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే “తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప” అని న్యూస్ వినిపిస్తుంది. ఆ తరువాత “అసలు పుష్ప ఎక్కడ” అని ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఆసక్తికరంగా కట్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ పూర్తి వీడియోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే కానుకగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రియలైజ్ చేయనున్నారు.

పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి.

ఇవి కూడా చదవండి

అప్పటివరకు తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువయ్యాడు. ఈక్రమంలో తాజాగా విడుదలైన గ్లింప్స్ మరోసారి భారీ హైప్ క్రియేట్ చేసింది. మైత్రీ మువీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇందులో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.