AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun – Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే నేడు. ఈ సంద్రభంగా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్ రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు అట్లీ. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచడమే కాకుండా, సినిమాలోని హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌ని పరిచయం చేసింది.

Allu Arjun - Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్..
Allu Arjun Atlee
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2026 | 11:08 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, ఇప్పుడు అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు బన్నీ పుట్టినరోజు (ఏప్రిల్8 ). ఈ సందర్భంగా మంగళవారం ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఎక్కువ మంది చదివినవి : Babu Mohan: స్టార్ హీరోలను సైతం లెక్క చెయ్యదు.. ఎవరినీ పట్టించుకోదు.. ఆమెలా ఎవరూ బతకలేరు.. బాబూ మోహన్ కామెంట్స్..

తాజాగా ఈ రోజు బన్నీ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా పేరు “రాకా” అని ఫిక్స్ చేశారు..  విడుదలైన టైటిల్ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. పోస్టర్ డార్క్ అండ్ ఇంటెన్స్ కలర్ గ్రేడింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లు అర్జున్ లుక్ రివీల్ చేయకపోయినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఒక భారీ యాక్షన్ డ్రామాను సూచిస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్‏లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుంది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivas Rao: చాలా మంది నటులు ఉన్నారు.. కానీ ఆ హీరోకు ఉన్న సత్తా ఎవరికీ లేదు.. కోట శ్రీనివాస రావు..

Follow Us