Pushpa: పుష్ప రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అల్లువారి వారసులు.. తగ్గేదే లే.. అంటూ అతిధులతో క్లాప్స్ కొట్టించిన అర్హ, అయాన్

|

Dec 13, 2021 | 8:37 AM

Pushpa Event: అల్లువారి వారసుడు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విభిన్న నేపధ్య సినిమాలతో డ్యాన్స్ లతో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా సుకుమార్..

Pushpa: పుష్ప రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అల్లువారి వారసులు.. తగ్గేదే లే.. అంటూ అతిధులతో క్లాప్స్ కొట్టించిన అర్హ, అయాన్
Pushpa Movie
Follow us on

Pushpa Event: అల్లువారి వారసుడు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విభిన్న నేపధ్య సినిమాలతో డ్యాన్స్ లతో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో బన్నీ హీరోగా డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో  పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక సహా చి త్ర యూనిట్ బృందం హాజరు కాగా రాజ మౌళి, కొరటాల శివ లు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.

అయితే ఈ వేడుకలో ఓ ఇద్దరు బుల్లి సెలబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.  అతిరథమహారాధుల మధ్య కూడా అల్లువారి కొత్త తరం చిన్నారులు అల్లు అయాన్, అర్హలు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తండ్రి అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్హ, అల్లు అయాన్ లు పుష్ప ప్రీ రిలీజ్ స్టేజ్ పై చేసిన సందడి చూపరులను ఆకట్టుకుంది.

అల్లు అర్హ, అల్లు అయాన్ లు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చేసిన హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఇక వీరిద్దరూ చెప్పిన డైలాగ్స్ వెరీవెరీ స్పెషల్ గా నిలిచాయి. స్టేజ్ మీద అల్లు అయాన్    ముందుగా నేను మాట్లాడతా అంటూ.. అడిగి మరీ మైక్ తీసుకునున్నాడు. తగ్గేదే లే అంటూ.. తన తండ్రి మేనరిజాన్ని చూపించి అందరితోనూ క్లాప్స్ కొట్టించాడు. అల్లు అర్హ మైక్ తీసుకుని .. అందరికీ నమస్కారం.. హాయ్ అంటూ చాలా క్లాస్ గా పలకరించింది.  తరువాత తన తండ్రి అల్లు అర్జున్ స్టైల్ లో  తగ్గేదే లే.. అంటూ డైలాగ్ చెప్పి.. విజిల్స్ వేయించింది. చిట్టి చిట్టి మాటలతో అయాన్, అర్హ లు చెప్పిన డైలాగ్స్ .. అక్కడ ఉన్న అతిథులతో పాటు ఆహుతులను కూడా ఆకట్టుకుంది. సూపర్ రెస్పాన్స్ అందుకున్నారు. తన మనవలు చెప్పిన క్యూట్ క్యూట్ మాటలతో అక్కడ ఉన్న తాత అరవింద్ మోముపై చిరునవ్వు కదలాడింది. చెప్పలేని ఆనందాన్ని చూసినవారికీ వెంటనే అసలు కంటే కొసరు ముద్దు అన్న సామెతను గుర్తు  చేసింది.

Also Read:  ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఊహాత్మకంగా అడుగు.. మధ్య ఆసియా ఐదు దేశాలకు ఆహ్వానం..