
అల్లరి నరేష్.. చాలా కాలం తర్వాత ఇటీవల నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. నాంది వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నరేష్. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ అచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆగస్ట్ 12న ఆయన తన తదుపరి చిత్రం సభకు సమస్కారం మూవీని ప్రారంభించారు. ఇది నరేష్ కెరీర్లో 58వ సినిమాగా రాబోతుంది. ఈ సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌కు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తుండగా.. మహేష్ ఎస్. కోనేరు నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలను జరపుకుంది. నరేష్ కూతురు అయాన క్లాప్ ఇవ్వడంతో తొలి షాట్‌కు ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే నటీనటులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక తాజాా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నరేష్‌తోపాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం. ఇందులో నవీన్ పాత్ర కాస్త నెగిటివ్ షేడ్స్ కలిసి ఉండనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన అరవింద సమేత సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.
ట్వీట్..
Allari Naresh @allarinaresh’s #SabhakuNamaskaram formally launched
Clap by Naresh’s daughter #Ayana & First Shot direction by Naandi Director #Vijay
Director: #SatishMallampati
Producer: @smkoneru
DOP: #ChotaKNaidu
Music: @SricharanPakalaShoot Begins this September pic.twitter.com/XmViOsbqzg
— BARaju’s Team (@baraju_SuperHit) August 12, 2021
Also Read: Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..
Love Story: ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ లాక్ చేసిన చిత్రయూనిట్ ?