Anupama Parameswaran: రెక్కలు విప్పిన ‘బటర్ ఫ్లై’.. అనుపమ లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్..

|

Mar 09, 2022 | 9:10 AM

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ.

Anupama Parameswaran: రెక్కలు విప్పిన బటర్ ఫ్లై.. అనుపమ లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్..
Anupama Parameswaran
Follow us on

Anupama Parameswaran: అందాల భామ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. ఆతర్వాత హీరోయిన్ గా దూసుకుపోతుంది అనుపమ. అఆ సినిమాతర్వాత ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలొ గురు ప్రేమకోసమే వంటి సినిమాలతో ప్రేక్షకులనియు అలరించింది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుపమ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ మూవీస్ లో ‘బటర్ ఫ్లై’  ఒకటి. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఘంటా సతీశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమిక ఒక కీలకమైన పాత్రను పోషించింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలతోపాటు కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తుంది అనుపమ. ఈ రెండు సినిమాల్లో కుర్ర హీరో నిఖిలే హీరో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సరసన ఆ ముద్దుగుమ్మ.. బాబీ.. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..

Priyanka Jawalkar: కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ముద్దుగుమ్మ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత  అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..