Srinidhi Shetty :ఒకేఒక్క సినిమా కేజీఎఫ్ బ్యూటీ ఆశలన్నీ ఆవిరిచేసిందంట..

శ్రీనిధి శెట్టి.. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పేరు బాగా వినిపించింది. సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ భామ. కేజీఎఫ్ సినిమా పొగరెక్కిన అమ్మాయిగా నటించిన శ్రీనిధి శెట్టి తన అందంతో

Srinidhi Shetty :ఒకేఒక్క సినిమా కేజీఎఫ్ బ్యూటీ ఆశలన్నీ ఆవిరిచేసిందంట..
Srinidhi Shetty

Updated on: Sep 03, 2022 | 7:56 AM

శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty).. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పేరు బాగా వినిపించింది. సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ భామ. కేజీఎఫ్ సినిమా పొగరెక్కిన అమ్మాయిగా నటించిన శ్రీనిధి శెట్టి తన అందంతో..నటనతో ఆకట్టుకుంది. ఇక కేజీఎఫ్ రెండు పార్ట్ లు భారీ విజయం సాధించడంతో ఈ అమ్మడి రేంజ్ మారిపోయింది. రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. ఇక ఈ చిన్నదానికి కోసం అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే వచ్చిన అవకాశాలన్నీ ఓకే చేయకుండా సెలక్టివ్ గా వెళ్తోంది శ్రీనిధి శెట్టి. ఈ క్రమంలోనే రీసెంట్ గా విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం భారీగానే ముట్టజెప్పారు ఈ అమ్మడికి. కానీ ఇప్పుడు శ్రీనిధి శెట్టి ఊహించని షాక్ తగిలింది.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోబ్రా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతోంది. విక్రమ్ దాదాపు 10 గెటప్స్ కి ఈసినిమాలో కనిపించి ఆకట్టుకున్నారు. విక్రమ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి. దాంతో శ్రీనిధి శెట్టి ఆశలన్నీ గల్లంతయ్యాయి. కోబ్రా సినిమా హిట్ అయ్యి ఉంటే ఇంకా బడా స్టార్ హీరోల సినిమాకు వస్తాయన్న ఆశ పెట్టుకుంది ఈ చిన్నది. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అమ్మడి ఆశలన్నీ ఆవిరైనట్టే అనిపిస్తుంది. వరుసగా వచ్చిన ఆఫర్లను ఓకే చేసి ఉంటే బాగుండేది అన్న టాక్ వినిపిస్తుంది ఇప్పుడు. మరి ఈ చిన్నదానికి ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..