
సెలబ్రిటీల పిల్లలు సినిమా పరిశ్రమలోకి రావడం సర్వసాధారణమే. ఇక కొందరు హీరోల పిల్లలైతే యాక్టింగ్ లో సరైన శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కుమారుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. ఇటీవల ఆయుష్ పుట్టిన రోజున కుటుంబం మొత్తం మంత్రాలయం రాఘవేంద్ర స్వామని దర్శించుకుంది. అక్కడే ఆయుష్ మొదటి సినిమా స్క్రిప్ట్ కు పూజలు కూడా నిర్వహించారని సమాచారం. ఉపేంద్రకు కన్నడలోనే తెలుగులోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మొదట దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అతను ఆ తర్వాత హీరోగా కూడా మెరిశాడు. ఇక ఉపేంద్ర భార్య, ఆయుష్ తల్లి ప్రియాంక ఉపేంద్ర కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇటీవల కూడా ఆమె నటించిన ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఉపేంద్ర దంపతులు తమ కుమారుడిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ వార్త విన్న ఉప్పీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఉపేంద్ర కుమారుడి మొదటి సినిమా దర్శకుడు ఎవరన్నది కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం. కన్నడ సూపర్ స్టార్ యష్ తో సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన ఓ దర్శకుడు ఇప్పుడు ఆయుష్ ను లాంఛ్ చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు పురుషోత్తం. గతంలో యష్, భామ కలిసి నటించిన ‘మొదలా సాలా’ చిత్రానికి పురుషోత్తం దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయనే ఆయుష్ మొదటి సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఆయుష్ పుట్టినరోజు సందర్భంగా ఉప్పీ కుటుంబంతో పాటు నటి తార కుటుంబం మంత్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార భర్త వేణు గోపాల్ ఉప్పి కొడుకు మొదటి చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయనున్నారు. ఇక ఆయుష్ సినిమాలో హీరోయిన్‌గా ఎవరినీ తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది. ఉపేంద్ర కుమారుడికి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే అతను మంచి ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.