Alia Bhatt : ‘ఆలియాకు కవల పిల్లలు..’అనుకోకుండా విషయం లీక్‌ చేసిన రణ్‌బీర్

|

Jul 17, 2022 | 3:17 PM

బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా క్రేజ్‌ సంపాందిచుకున్న ఆలియా భట్‌.. తాజాగా తల్లి కాబోతున్నా.. అంటూ రివీల్ చేసి అందర్నీ షాక్ చేశారు. చాలా గ్రాండ్‌ గా తన లవర్‌ కమ్‌ హీరో రణ్‌బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని.. మూడు నెలలకే ముచ్చటైన గుడ్ న్యూస్ చెప్పారు.

Alia Bhatt : ఆలియాకు కవల పిల్లలు..అనుకోకుండా విషయం లీక్‌ చేసిన రణ్‌బీర్
Alia Bhatt Ranbir Kapoor
Follow us on

బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా క్రేజ్‌ సంపాందిచుకున్న ఆలియా భట్‌(Alia Bhatt ).. తాజాగా తల్లి కాబోతున్నా.. అంటూ రివీల్ చేసి అందర్నీ షాక్ చేశారు. చాలా గ్రాండ్‌ గా తన లవర్‌ కమ్‌ హీరో రణ్‌బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని.. మూడు నెలలకే ముచ్చటైన గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఎట్ ప్రజెంట్ తన పెండింగ్ ప్రాజెక్ట్స్ ను చక చకా ఫినిష్‌ చేసే పనిలో ఉన్నారు ఆలియా. తన గురించిగాని తన స్థితి గురించి గాని ఏమాత్రం ఆలోచించకుండా.. డేరింగ్ యాక్షన్ సీన్లు చేస్తున్నారు. క్రిటికల్ క్లైమేట్ కండీషన్స్‌లో షూట్స్ చేస్తున్నారు. ఇక ఆలియా తో పాటు.. రణ్‌బీర్ కూడా.. తనన సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఓ పక్క పాన్ ఇండియన్‌ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌లో పాల్గొంటూనే.. తన లెటెస్ట్ రిలీజ్ షెంషేరా సినిమా ప్రమోషన్లో తలమునకలై ఉన్నారు. జూలై 22న రిలీజయ్యే ఈ సినిమా కోసం మాగ్జిమమ్‌ ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ఇంటర్య్వూలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను షాక్ చేశారు. ఆలియా కు కవలల పిల్లలు పుట్టబోతున్నారంటూ చెప్పి రణ్‌బీర్ అందర్నీ కన్‌ఫ్యూజ్ చేశారు.

ఓ ఇంటర్య్వూలో యాంకర్‌తో కలిసి సరదాగా ఓ గేమ్‌ ఆడిన రణ్‌బీర్.. ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇక అకార్డింగ్ టూ ఆ గేమ్‌.. రణ్‌బీర్ యాంకర్‌ కు రెండు నిజాలు.. ఒక అబద్దం చెప్పాలి? అందులో ఏది నిజమో.. ఏది అబద్దమో యాంకర్ కనిపెట్టి చెప్పాల్సి ఉంటుంది. అందుకు రణ్‌బీర్ “ఆలియాకు కవలలు పుట్టబోతున్నారు. నేను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పౌరాణిక చిత్రంలో నటిస్తున్నాను. నేను త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్తున్నాను” అనే మూడు స్టెట్మెంట్లు ఇచ్చారు. వీటిలో ఏది అబద్దమో.. ఏ నిజమో యాంకర్‌ను చెప్పాలన్నారు.

ఇక రణబీర్ చెప్పిన మాటలు విన్న యాంకర్ ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఏది నిజమో.. అబద్దమో చెప్పలేక సతమతమయ్యారు. అయితే గేమ్‌ రూల్ ప్రకారం రణ్‌బీర్ చెప్పిన మూడు స్టెట్మెంట్లో.. యాంకర్ రెండు నిజాలు గుర్తు పట్టాల్సి ఉంటుంది. అయితే వీటిలో రణ్ బీర్ చెప్పిన రెండో స్టేట్మెంట్ “భారీ బడ్జెట్‌తో పౌరాణిక సినిమా”.. ఇది త్వరలో నిజమయ్యేలా ఉంది.. బాలీవుడ్‌లో ఇందకు సంబంధించిన టాక్‌ కూడా ఉంది. ఇక మూడో స్టేట్మెంట్ త్వరలోనే “సినిమాలకు గుడ్‌ బై” ఇది అబద్దం అనే విషయం వినగానే ఎవరికైనా తెలుస్తుంది. ఇక మొదటి స్టేట్మెంట్ “ఆలియాకు కవలల పుట్టబోతున్నారు” ఇది నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక దీన్ని బట్టే రణ్ బీర్ చెప్పిన మొదటి రెండు స్టెట్మెంట్స్ నిజాలని.. మూడో ది అబద్దమని చెబుతున్నారు నెటిజెన్లు.. ఆయన అభిమానులు. ఆలియాకు కవలలు పుట్టబోతున్నారంటూ నెట్టింట వారు గట్టిగా చెబుతున్నారు.. ఈన్యూస్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి