Song Sequence In RRR: జక్కన్ననా మజాకా.. ఒక్క సాంగ్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేయనున్నారట..

| Edited By: Surya Kala

Jul 15, 2021 | 1:27 PM

Song Sequence In RRR: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే అద్భుతమైన దృశ్యాల సమాహారంలా ఉంటుంది. కథను అల్లుకునే తీరు .. ఆ కథను ఆవిష్కరించే విధానం .. కథనాన్ని నడిపించే..

Song Sequence In RRR:  జక్కన్ననా మజాకా.. ఒక్క సాంగ్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేయనున్నారట..
Rrr Song
Follow us on

Song Sequence In RRR: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే అద్భుతమైన దృశ్యాల సమాహారంలా ఉంటుంది. కథను అల్లుకునే తీరు .. ఆ కథను ఆవిష్కరించే విధానం .. కథనాన్ని నడిపించే తీరు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. అందుకే జక్కన్న డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. బాహుబలి తర్వాత దర్శకదిగ్గజం తెరకెక్కిస్తున్న మెగా మల్టీస్టార్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై చిత్ర పరిశ్రమలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తూ.. సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అదేంటంటే కేవలం ఒక్క పాట కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. ఈ పాటలో అలియా భట్ సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. అలియా కాస్ట్యూమ్స్‌ కోసమే దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే కేవలం ఒక్క పాట కోసం మూడు కోట్ల బడ్జెట్‌ వెచ్చించడం అంటే సాధారణంగా ఆశ్చర్యపరిచే విషయమే కానీ.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఆ వార్త అంత పెద్ద విషయమేం కాదు. జక్కన్న అనుకున్నట్లుగా సినిమాను మలిచేందుకు జక్కన్న ఎక్కడా వెనక్కి తగ్గరు. ఆయనకు తగ్గట్లుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్‌ పెట్టేందుకైనా సిద్ధంగా ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఈ చర్చంతా ఎందుకు అనుకుంటున్నారా..? విషయమేంటంటే మూడు కోట్ల ఖర్చు విషయం పక్కనపడితే… భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ పాట రూపుదిద్దుకోనుందట. అయితే దీనిపై ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అప్పటివరకూ వెయిట్‌ చేయాల్సిందే.

Also Read: పెద్దలు హై బీపీ తో బాధపడుతున్నా.. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలన్నా ఈ యోగాసనాన్ని చేసి చూడండి