
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవర సినిమా రిలీజ్ దెగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అండ్ టీమ్ వివిధ నగరాల్లో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో చెన్నై, ముంబై లాంటి నగరాల్లో ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ముంబై లో దేవర మూవీ ప్రమోషన్స్ చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ , ఎన్టీఆర్ తో కరణ్ హోస్ట్ గా ఓ ఇంటర్వ్యూ చేశారు. అలియా తన లేటెస్ట్ సినిమా జిగ్ర ప్రమోషన్ చేయగా తారక్ దేవర ప్రమోషన్ చేశారు. ఇక ఈ ఇద్దరినీ కలిపి కరణ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అలియా, తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఎన్టీఆర్ ను అలియా భట్ ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే తారక్ కూడా అలియా నటనను డెడికేషన్ ను కొనియాడారు.
కాగా ఈ ఇంటర్వ్యూలో అలియా దేవర మూవీ సాంగ్ ను ఆలపించింది. దేవర సినిమాలోని చుట్టమల్లే చుట్టేస్తాందే సాంగ్ ను క్యూట్ గా పాడింది అలియా. అలియా పడుతుంటే తారక్ షాక్ అయ్యారు. అంత అద్భుతంగా తెలుగు పాట పాడింది అలియా భట్. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలియా సింగింగ్ టాలెంట్ ను నెటిజన్స్ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దేవర సినిమా విషయానికొస్తే దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు మంది రెస్పాన్స్ వచ్చింది.
.@aliaa08 sang the global sensation #Chuttamalle song ❤️❤️#Devara @tarak9999 #DevaraKaJigra pic.twitter.com/5xt5PyHAXZ
— Suresh PRO (@SureshPRO_) September 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.