ఇటీవల సినిమా ఇండస్ట్రీలో శుభవార్తలు గట్టిగానే వినిపించాయి. చాల మంది పెళ్లిపీటలెక్కారు.. మరికొంతమంది అమ్మానాన్న గా ప్రమోషన్ అందుకున్నారు. వీరిలో అందాల భామ అలియాభట్ ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న అలియా తెలుగు ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయం అయ్యింది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అలరించింది అలియా.. ఈ సినిమా తర్వాత తాను ప్రేమించిన హీరో రణబీర్ కపూర్ ను పెళ్లాడింది. చాలా కాలంగా ప్రేమలో తేలిపోతున్న ఈ జంట ఏప్రిల్ 14 2022లో వివాహబంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత అలియా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త తో కలిసి పెళ్లితర్వాత బ్రహ్మాస్త్ర సినిమాలో నటించింది ఈ చిన్నది . ఆ తర్వాత నవంబర్ 6న పండంటి పాపకు జన్మనించింది.
ప్రస్తుతం అలియాభట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. పాపాయి పుట్టిన తర్వాత పూర్తిగా ఆమెతోనే గడుపుతోంది. ప్రగ్నెన్సీ సమయంలో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి అలరించిన అలియా . పాపాయి పుట్టిన తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోలేదు. కానీ తాజాగా ఒక ఫోటో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
పాపకు పాలు పడుతున్న ఫోటోను వైరల్ అవుతోంది. అలియా భట్ తన కూతురికి రహ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో పాప మొహం కనిపించకుండా ఉండేలా ఉంది. ఇలా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న అలియాను చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్. కానీ ఈ ఫోటో ఫేక్ అని తెలుస్తోంది. కొంతమంది మార్ఫింగ్ చేసి ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.