బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అలియా భట్. అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. స్టూడేంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన అలియా.. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. బీటౌన్ హీరో రణబీర్ కపూర్‌తో వివాహం.. పాప జన్మించిన తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలియా ముఖంలో వచ్చిన మార్పుల గురించి అనేక వార్తలు వైరలవుతున్నాయి. అలియా ముఖం ఒకప్పటిలా లేదని.. ఆమె చిరునవ్వు, మాట్లాడే తీరు మారిపోయిందని.. ఆమె ముఖానికి సర్జరీ చేయించుకుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల ఓ కాస్మొటాలజిస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఓ కాస్మెటిక్ సర్జన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అలియా భట్ ఫోటోలు చూస్తుంటే, ఆమెకు ముఖ పక్షవాతం వచ్చినట్లు అనిపిస్తుందని.. ఆమె నవ్వు వంకరగా ఉంటుందని.. ఆమె బొటాక్స్ (కాస్మెటిక్ సర్జరీ) చేయించుకున్నట్లు కనిపిస్తోందని.. అది సక్సెస్ కాకపోవడంతో ఆమెకు ముఖ పక్షపాతం వచ్చినట్లు అనిపిస్తుందని.. ఇలాగే తన వద్దకు వచ్చిన చాలా మందికి జరిగిందని.. ఆ సమస్యకు చికిత్సతో నయం చేయొచ్చు అంటూ కామెంట్స్ చేశాడు.
దీంతోఆ కాస్మోటిక్స్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ అలియా పాత ఫోటోలు, ప్రస్తుత ఫోటోస్ పోల్చి చూస్తు ఆమెకు ముఖ పక్షపాతం వచ్చిందని కామెంట్స్ చేశారు. తాజాగా తన గురించి వస్తున్న వార్తలపై అలియా రియాక్ట్ అయ్యింది. “ఏంటీ.. తమాషాలు చేస్తున్నారా..? కాస్మోటిక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా.. ? నా గురించి వస్తున్న వార్తలను నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఒక వ్యక్తి ముఖం ఎలా మాట్లాడుతున్నారు.అలాగే చికిత్స అంటూ వివరణలు ఇస్తున్నారు. నేను పక్షవాతంతో బాధపడుతున్నానా.. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా నా గురించి ఎలా స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు. ఇదంతా కేవలం పాపులారిటీ కోసం, వ్యూస్ కోసమే చేస్తున్నారు. డబ్బు సంపాదించడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీ శరీరం, ముఖం, వ్యక్తిగత జీవితం గురించి ఇలా నీచంగా మాట్లాడేవారిపై మనం గళం విప్పాలి. ఇలా మన శరీరాల గురించి మాట్లాడేవారు హనికరం” అని అన్నారు అలియా.
ఇది చదవండి : Ram Charan: అప్పుడేమో క్యూట్‌గా.. ఇప్పుడేమో హాట్‌గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..
Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..
Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.