Jani Master: ‘జైలు…జీవితాన్ని నేర్పించింది’.. జానీ మాస్టర్‌ – జైల్‌ లెస్సన్స్‌

నేషనల్ అవార్డు అందుకోకుండా కటకటాలు అడ్డుకున్నాయి. అమ్మకు హార్ట్‌ అటాక్‌ వస్తే...చూడడానికి వెళ్లలేవంటూ అవే జైలు గోడలు వెక్కిరించాయి. పాన్‌ ఇండియా సినిమా చాన్స్‌ మిస్సయిపోయింది. తెర నుంచి చెర దాకా సాగిన వ్యథ. జానీ మాస్టర్‌ - జైల్‌ లెసన్స్‌ కథ. డ్యాన్స్‌, లైఫ్‌ ఇచ్చింది. కానీ జీవితం అంటే ఏంటో జైలు నేర్పించిందా? అందుకే డ్యాన్స్ మాస్టర్‌ నోట ఆ డైలాగ్‌ వచ్చిందా?

Jani Master: 'జైలు...జీవితాన్ని నేర్పించింది'.. జానీ మాస్టర్‌ - జైల్‌ లెస్సన్స్‌
Jani Master
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 26, 2024 | 9:07 AM

జీవితం అంటే ఏంటో జైలు నేర్పించింది. జైలు నుంచి బయటకు వచ్చాక జానీ మాస్టర్ మాట్లాడిన మొదటి మాట ఇదే. డ్యాన్స్‌ అతగాడికి లైఫ్‌ ఇచ్చింది.స్టెప్పులు వేస్తూ లైఫ్‌లో ఒక్కో స్టెప్‌ ఎదిగాడు. కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లో ఓ రేంజ్‌కి చేరుకున్నాడు. టాప్‌ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. రైట్‌ స్టెప్‌ వేశాడో, రాంగ్‌ స్టెప్‌ వేశాడో తెలియదు కానీ….లైఫ్‌ డ్యాన్స్‌లో పొరపాటునో గ్రహపాటునో పడ్డ స్టెప్‌, జానీమాస్టర్‌ని జైలుకు చేర్చింది. జైలుకు వెళ్లడం అంటే నాలుగు గోడల మధ్య బందీగా ఉండడం మాత్రమే కాదు. జైలుకు వెళ్లడం అంటే జీవితాన్ని కోల్పోవడం. అయినవాళ్లకు దూరమవడం. కష్టాలకు దగ్గరవడం. ఇవన్నీ చూశాకే, జైలు.. జీవితాన్ని నేర్పించిందంటూ జానీ మాస్టర్‌ కామెంట్‌ చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెప్టెంబర్‌ 19న జానీ మాస్టర్‌ అరెస్ట్‌

పోక్సో కేసులో జైలుకు వెళ్లిన జానీ మాస్టర్‌…ఎట్టకేలకు రిలీజయ్యారు. అవకాశాల పేరుతో తనను బెదిరించి జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ గత నెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్‌తో పాటు ఆయన భార్య పేరును కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 2019లో మైనర్‌గా ఉన్నప్పటి నుంచే తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని బాధితురాలు వాంగ్మూలంలో వెల్లడించారు. దాంతో.. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. సెప్టెంబర్‌ 19న అరెస్ట్ చేశారు. ఫలితంగా.. జానీ మాస్టర్‌ 36 రోజులపాటు చంచల్‌గూడలో జైలు జీవితం గడిపారు. తాజాగా.. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు. ఈ సందర్భంగా జైలు.. జీవితాన్ని నేర్పించిందంటూ జానీ మాస్టర్‌ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

నేషనల్‌ అవార్డ్‌ మిస్‌

కేసు కారణంగా జానీ మాస్టర్‌ అందుకోవాల్సిన నేషనల్ ఫిల్మ్‌ అవార్డు మిస్‌ అయింది. ధనుష్‌ నటించిన తిరుచిట్రంబలం సినిమాకు గానూ జానీ మాస్టర్‌ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డ్‌కు ఎంపికయ్యారు. అవార్డు అందుకునేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అయ్యారు. కానీ.. పోక్సో కేసుతో జానీమాస్టర్‌కు ఊహించని షాక్‌ ఇస్తూ అవార్డ్‌ను నిలిపివేసింది కమిటీ. అంతేకాదు.. అతడిని దూరంగా పెట్టింది జనసేన. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. ఇక జైల్లో ఉండడంతో పుష్ప-2 మూవీలో ఓ సాంగ్‌కు కొరియోగ్రఫీ చాన్స్‌ కూడా దూరమవడం…జానీ మాస్టర్‌కు కెరీర్‌ పరంగా బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆ విషయాన్ని ఆ సినిమా నిర్మాతలే స్వయంగా ప్రకటించారు.

ఇక తల్లికి హార్ట్‌ అటాక్‌ వచ్చినా…చూడడానికి వెళ్లలేకపోయారు జానీ మాస్టర్‌. ఇలా కుటుంబపరంగా కెరీర్‌ పరంగా చాలానే నష్టపోయాడు జానీ మాస్టర్‌ అంటున్నారు అతగాడి అభిమానులు. ఇవన్నీ ఎంతో ఆవేదనను మిగిల్చి….జీవితం అంటే ఏంటో జానీ మాస్టర్‌కు జైల్‌ లెసన్స్‌ నేర్పినట్లే కనిపిస్తుంది. డ్యాన్స్‌ లైఫ్‌ ఇస్తే…జైలు జీవితాన్ని నేర్పించింది. అందుకే డ్యాన్స్‌ మాస్టర్‌ ఆవేదన..ఆ డైలాగ్‌ రూపంలో బయటికొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.