Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురంలో..

అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అల వైకుంఠపురంలో.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా  గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో..
Allu Arjun

Updated on: Jun 13, 2021 | 10:00 PM

Ala Vaikunthapurramuloo:

అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అల వైకుంఠపురంలో.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను, తమన్ తన మ్యూజిక్ తో మరో మెట్టు ఎక్కించాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ కి చెందిన బడా నిర్మాతలు పోటీపడ్డారు.త్వరలో బాలీవుడ్ లోనూ రీమేక్ కానుంది. కార్తీక్ ఆర్యన్ -కృతి సనోన్ జంటగా నటిస్తున్నారు. అల్లు అర్జున్- పూజా హెగ్డే పాత్రలను ఈ జోడీ తిరిగి పోషించనున్నారు. ఇటీవల కార్తీక్ ఆర్యన్ ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ హిట్ బుట్ట బొమ్మా పాటకు డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు.

పూజ హెగ్డే చేసిన పాత్రలో కృతి సనన్ ను అనుకుంటున్నారట. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.  ప్రస్తుతం హిందీ వెర్షన్ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని అతడు హింట్ ఇచ్చాడు. అల్లు అరవింద్ స్వయంగా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి  సన్నాహాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?

Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..