Saranga Dariya: సాయిపల్లవి ఖాతాలో మరో రికార్డు.. కొనసాగుతున్న ‘సారంగదరియా’ హవా…

|

Apr 24, 2021 | 2:50 PM

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా

Saranga Dariya: సాయిపల్లవి ఖాతాలో మరో రికార్డు.. కొనసాగుతున్న సారంగదరియా హవా...
Sai Pallavi
Follow us on

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈనెల 16న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్. అయితే ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్ తోపాటు సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ అందింది. అయితే ఈ సినిమాలోని సారంగదరియా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ టైంలోనే ‘సారంగదరియా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. తాజాగా ఈ సాంగ్ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సంచలనం క్రియేట్ చేసింది.

ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. మంగ్లీ గాత్రం, సాయిపల్లవి స్టెప్పులకు తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఫిదా అయ్యారు. తెలంగాణ జానపదం కావడం, పవన్‌ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్‌, 1.2 మిలియన్ల లైకులను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమ సినిమా పాటకు 150 మిలియన్ల వ్యూస్‌ రావడం పట్ల ‘లవ్‌స్టోరీ’ యూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తుంది. ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రిలీజ్ అయిన 14 రోజుల్లోనే యూట్యూబ్‏లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఇంత తక్కువ కాలంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొదటి తెలుగు పాటగా సారంగదరియా నిలిచింది. ఈ సాంగ్ కంటే ముందు తమిళ స్టార్ హీరో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘రౌడీ బేబి’ సాంగ్ కేవలం 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది.

వీడియో..

Also Read: Mahesh Babu: అభిమానులకు మహేష్ బాబు రిక్వేస్ట్.. ప్లాస్మా దానం చేయాలంటూ ట్వీట్..