అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న చైతన్య. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మనం లాంటి బ్లాక్‌బస్టర తరువాత నాగచైతన్య, విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న సినిమా ఇది. ఈ మూవీకి థ్యాంక్యూ(Thank You) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుపుకుంటుంది ఈ మూవీ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు.
జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమానుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ మూవీ టీజర్ టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5గం.4నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈమేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. నాగచైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెప్తుండగా విక్రమ్ కుమార్ వీడియో రికార్డ్ చేశారు. ఎందుకు రికార్డ్ చేస్తున్నారని చైతన్య ప్రశ్నించగా సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నాం అని అంటారు. దాంతో చైతన్య షాక్ అయ్యాడు. థ్యాంక్యూ టీజర్ రిలీజ్ చేస్తున్నారా.. ? ఎప్పుడు.? అని ప్రశ్నించాడు దాంతో ఈ వీడియా ముగిసింది. ఈ ఇంట్రస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :