Naga Chaitanya: రేసింగ్‏లోకి అక్కినేని యువసామ్రాట్.. నాగ చైతన్య కొనుగోలు చేసిన టీమ్ ఏదంటే..

|

Aug 21, 2024 | 1:06 PM

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చైతూ.. అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఫుడ్ బిజినెస్‏లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షోయూ (Shoyu) పేరుతో హైదరాబాద్‏లో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అలాగే చైతూకు ఆటోమొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువ. కార్, బైక్ రేసింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పటికే చైతూ వద్ద అనేక లగ్జరీ మోడల్ వెహికల్స్ ఉన్నాయి.

Naga Chaitanya: రేసింగ్‏లోకి అక్కినేని యువసామ్రాట్.. నాగ చైతన్య కొనుగోలు చేసిన టీమ్ ఏదంటే..
Naga Chaitanya
Follow us on

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చైతూ.. అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఫుడ్ బిజినెస్‏లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షోయూ (Shoyu) పేరుతో హైదరాబాద్‏లో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అలాగే చైతూకు ఆటోమొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువ. కార్, బైక్ రేసింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పటికే చైతూ వద్ద అనేక లగ్జరీ మోడల్ వెహికల్స్ ఉన్నాయి. తాజాగా తనకు ఇష్టమైన రేసింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చైతూ. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. దీంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) ఆధ్యర్యంలో జరిగే ఫార్ములా 4లో భాగమయ్యాడు. ఈ సీజన్ కు సంబంధించిన రేసులు ఈనెల 24 నుంచి స్టార్ట్ కానున్నాయి. నిజానికి చైతూకు ఫార్ములావన్ అంటే చాలా క్రేజీ. బుల్లెట్ లా దూసుకుపోయే ఈ కారు రేసింగ్ చూసేందుకు ప్రతిసారి సీజన్లలో పాల్గొంటారు.

ఇప్పటికే చైతూ వద్ద సూపర్ కార్స్, కొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిళ్లను తన గ్యారేజీలో పెట్టుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్ లో భాగం కావడంతో లీగ్ పై మరింత ప్రేక్షకాదరణ పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు నిర్వాహకులు. తనకు చిన్నప్పటి నుంచి కారు రేసింగ్ అంటే చాలా ఇష్టమని.. ఫార్ములావన్ అంటే పిచ్చి అని.. హైస్పీడ్ డ్రామాను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు నాగచైతన్య. ఫార్మాలావన్ పై ఉన్న క్రేజీతోనే తాను సూపర్ కార్స్, బైక్స్ కొన్నానని.. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ అంటే ఈవెంట్ కాదని.. అంతకు మించిన అడ్వెంచర్ కూడా అని అన్నారు. అందుకే తాను ఇప్పుడు రేసింగ్ లో భాగమయ్యానని.. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ తన అంచనాలకు అనుగుణంగా రేసింగ్ లో దూసుకెళ్తుందని అన్నారు నాగచైతన్య.

Chaitanya

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే సమంతతో విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న చైతూ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న చైతూ.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.