అక్కినేని ఫ్యామిలీకి అసలేమైంది.. పక్కా ప్లానింగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్.. పూర్తి వివరాలు ఇవే.!

| Edited By: Ravi Kiran

Aug 27, 2023 | 8:30 AM

2022 సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమాకు మొదటి రోజు 17 కోట్ల గ్రాస్.. 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అది చూసాక.. అక్కినేని హీరోల మార్కెట్ భారీగా పెరిగిందనుకున్నారంతా. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కనీసం ఫుల్ రన్‌లోనూ 10 కోట్ల మార్క్ అందుకోవడం లేదు.

అక్కినేని ఫ్యామిలీకి అసలేమైంది.. పక్కా ప్లానింగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్.. పూర్తి వివరాలు ఇవే.!
Akhil And Naga Chaitanya
Follow us on

ఈ అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది.. హీరోలు మేల్కొనరేం.. ఓ వైపు పరాజయాలు.. మరోవైపు దారుణమైన ఓపెనింగ్స్.. దీనికి తప్పదా చెల్లించక భారీ మూల్యం..! విజయాలు పక్కనబెట్టండి బాసూ.. అవిప్పుడు కాకపోతే తర్వాత వస్తాయి. కానీ క్రేజ్ ఏమైంది..? మార్కెట్‌కు వచ్చిన తిప్పలేంటి..? మరిప్పుడైనా నష్ట నివారణ చర్యలు మొదలయ్యాయా..? అక్కినేని బ్రదర్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చేస్తున్న ప్లానింగ్ ఏంటి..?

2022 సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమాకు మొదటి రోజు 17 కోట్ల గ్రాస్.. 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అది చూసాక.. అక్కినేని హీరోల మార్కెట్ భారీగా పెరిగిందనుకున్నారంతా. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కనీసం ఫుల్ రన్‌లోనూ 10 కోట్ల మార్క్ అందుకోవడం లేదు. ఒకేసారి అంత దారుణమైన పరాభవాలు ఎందుకొస్తున్నాయో ఫ్యాన్స్‌కు కూడా అంతు చిక్కట్లేదు.

మూవీ స్క్రీనింగ్‌కు వచ్చిన చై.. లేటెస్ట్ లుక్..

నాగార్జున సంగతి పక్కనబెడితే.. చైతూ, అఖిల్ పరిస్థితి దారుణంగా ఉందిప్పుడు. ఇప్పటికీ చైతూ మీడియం రేంజ్‌లోనే మిగిలిపోయారు. ఎన్ని విజయాలు వచ్చినా ఈయన మార్కెట్ 30 కోట్లు మించలేదు. కస్టడీకి ఫుల్ రన్ 10 కోట్లు రాలేదంటే పరిస్థితి అర్థమైపోతుంది. ప్రస్తుతం చందూ మొండేటి, శివ నిర్వాణలతో సినిమాలు కమిటయ్యారు ఈ హీరో.

బాయ్స్ హాస్టల్‌ సినిమాపై నాగచైతన్య కామెంట్స్…

అఖిల్ ఏజెంట్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ చిత్ర ఫైనల్ రన్ కలెక్షన్స్ కనీసం 7 కోట్లు కూడా రాలేదు. అప్పట్లో అఖిల్ డెబ్యూ మూవీ ఫస్ట్ డే 9 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. ఈ పరిస్థితి చూసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా రంగంలోకి దిగుతుందిప్పుడు. ఇకపై ఏడాదికి ఓ సినిమా చైతూ, అఖిల్‌తో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వాటి కోసమే కథల ఎంపిక మొదలైంది. మరి ఈ ప్లాన్స్ అయినా వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి. అక్కినేని బ్రదర్స్‌కు హిట్స్ వస్తాయో.? లేదో.? చూడాలి.

నాగచైతన్య నెక్స్ట్ మూవీ డీటెయిల్స్.. హీరోయిన్‌గా కీర్తి సురేష్, డైరెక్టర్ చందూ మొండేటి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..