Akhil Akkineni: ‘నేను మౌనంగా ఉండలేను’.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అఖిల్

|

Oct 04, 2024 | 11:22 AM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను విమర్శించే నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి

Akhil Akkineni: నేను మౌనంగా ఉండలేను.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అఖిల్
Konda Surekha, Akhil Akkineni
Follow us on

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను విమర్శించే నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ మూకుమ్మడిగా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. నాగార్జున, స‌మంత‌, ప్రకాశ్ రాజ్, చిరంజీవి, అమ‌ల‌, ఎన్‌టీఆర్, నాని, అల్లు అర్జున్, మంచు విష్ణు, చిరంజీవి, నాగ చైత‌న్య, ఖుష్బూ, ఆర్జీవీ, రామ్ చరణ్, మహేశ్ బాబు, రవితేజ తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఇక నాగార్జన కుమారుడు హీరో అఖిల్ అక్కినేని స్పందించారు. అమ‌ల చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘అమ్మ.. మీ ప్రతి మాట‌కు నేను మ‌ద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విష‌యంపై మీరు స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించ‌డం త‌ప్ప మ‌న‌కు వేరే మార్గం లేద’ అని పేర్కొన్నాడు అఖిల్.

తాజాగా మరోసారి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లపై స్పందించారు అక్కినేని అఖిల్. కొండా సురేఖ చేసిన నిరాధారమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత  సామాజిక సంక్షేమాన్ని మరచిపోయారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. గౌరవనీయమైన పౌరులు, నిజాయితీగల కుటుంబ సభ్యులు గాయపడ్డారు. అగౌరవంగా మిగిలిపోయారు. రాజకీయ యుద్ధంలో గెలవడానికి ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలిపశువులను చేసింది. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండను. ఇలాంటి వ్యక్తికి.. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు , మన్నన లేదు. ఇది క్షమించబడదు, సహించదు’ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అఖిల్.

అఖిల్ అక్కినేని ట్వీట్..

ఇదే విషయంపై రాజమౌళి స్పందించారు. ‘ గౌరవాన్ని కాపాడుకోండి. నిరాధార ఆరోపణలు సహించరాదు. ముఖ్యంగా ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలను చిత్ర పరిశ్రమ సహించదు’  ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టారు జక్కన్న.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.