Akhanda Movie Update: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “అఖండ”. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అఖండ పై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. అయితే ఈ చిత్రం నుంచి ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ మేకర్స్ ఇస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే గత మే 28న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది అని టాక్ వచ్చింది కానీ అది కాస్తా రాలేదు. దీంతో బాలయ్య అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత మరో ఒక అప్డేట్ తో సహా మరో కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ తోపాటు.. టీజర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది. అయితే ఆరోజున ఫస్ట్ సింగిల్ తో పాటుగా మరో టీజర్ ఉంటుందా ఉండదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆరోజు మాత్రం ఒక దానికంటే ఎక్కువ రావచ్చని తెలుస్తుంది. మరి ఆ రోజు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.
Also Read: మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్లో రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో సరికొత్త లుక్..
Chiranjeevi Konidela: ఆ చిన్నారి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది : మెగాస్టార్ చిరంజీవి